Chandrababu Arrest : చంద్రబాబు పిటీషన్లపై పొన్నవోలు రాకుంటే నేను వాదిస్తా : సీఐడీ పీపీ వివేకానంద

ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసిన పిటీషన్లపై ఈరోజు విచారణ జరుగనుంది. మొదట కస్టడీ పిటీషన్, ఆ తరువాత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడతామని..అంతే తప్ప అన్ని పిటీషన్ల విచారణ ఒకే సమయంలో విచారణ సాధ్యం కాదని తెలిపారు. మధ్యాహ్నాం లంచ్ తరువాత కష్టడీ పిటీషన్ పై వాదనలు వింటామని స్పష్టం చేశారు న్యాయమూర్తి. 

Chandrababu Arrest : చంద్రబాబు పిటీషన్లపై పొన్నవోలు రాకుంటే నేను వాదిస్తా : సీఐడీ పీపీ వివేకానంద

Chandrababu Bail Petitions Hearing on ACB Court

Updated On : September 20, 2023 / 1:19 PM IST

Chandrababu Bail Petitions Hearing : ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసిన పిటీషన్ల(Chandrababu Bail Petitions)పై మధ్యాహ్నాం విచారణ జరుగనుంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ జరుగనుంది. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై దర్మాసనం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు,సీఐడీ దాఖలు చేసిన ఈ రెండు పిటీషన్లపై జరుగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు పిటీషన్లపై మంగళవారమే విచారణ జరగాల్సి ఉన్నా..హైకోర్టులో క్వాష్ పిటీషన్ విచారణతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని అయినా విచారణకు తన నుంచి పూర్తి సహకారం అందిస్తానని..బెయిల్ ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. కానీ సీఐడీ మాత్రం చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో ఈరెండు పిటీషన్లపై విచారణ జరుగునుంది.

ఈ పిటీషన్లపై ప్రాధాన్యత క్రమంలో వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. మొదట కస్టడీ పిటీషన్, ఆ తరువాత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడతామని తెలిపారు. దీనికి ఏపీ  సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద  (CID PP Vivekananda)మధ్యాహ్నాం 2.15 వరకు సమయం అడిగారు. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జన్ రల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్యాహ్నాం 2.15గంటల వస్తారని.. అన్ని పిటీషన్లపై విచారణ ఒకేసారి చేయాలని వివేకానంద కోరారు. దానికి న్యాయమూర్తి అంగీకరించలేదు.అన్ని పిటీషన్ల విచారణ ఒకే సమయంలో విచారణ సాధ్యం కాదని..మొదట కస్టడీ పిటీషన్, ఆ తరువాత బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడతామని..ఒంటిగంటకల్లా పొన్నవోలు కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి (ponnavolu sudhakar reddy) రాకుంటే ఈ కేసు తాను వాదనలు వినిపిస్తానని సీఐడీ పీపీ వివేకానంద తెలిపారు.

Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్, కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు, 30రోజుల్లో ఎప్పుడైనా తీర్పు వెలువరించే అవకాశం

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని దానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ అయ్యాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బెయిల్ కోసం చంద్రబాబు న్యాయవాదులు, కస్టడీ కోసం సీఐడీ వాదనలు వినిపిస్తున్నాయి.