Sajjala Ramakrishna Reddy: విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే: సజ్జల

రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Sajjala Ramakrishna Reddy: విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే: సజ్జల

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తుందంటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన తీవ్ర విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. అమరావతిలో గురువారం సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వల్ల తప్పని పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగాయని పేర్కొన్నారు. ప్రజలపై భారం పడుతుందని తెలిసినా విద్యుత్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో స్వల్పంగా కూడా చార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల అన్నారు. రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:TTD Employees : టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. నెరవేరనున్న సొంతింటి కల

2014-19 మధ్య చంద్రబాబు భారీగా అప్పు, బకాయిలు ప్రభుత్వానికి మిగిల్చి వెళ్లారని..టీడీపీ హయాంలో అడ్డదిడ్డంగా విద్యుత్ చార్జీలు పెంచారని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 500 యూనిట్ల వరకూ ఒక్క పైసా కూడా పెంచలేదన్న సజ్జల..మూడేళ్లుగా తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకుండా.. ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వంమే భరించిందని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై నిన్నటి నుండి ప్రతిపక్ష పార్టీలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. ప్రజలపై రూ.42 వేల కోట్లు భారం మోపామంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Chandrababu: గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు: చంద్రబాబు

అప్పులు చేసినా చంద్రబాబులా దుబారా ఖర్చులు చెయ్యలేదన్న సజ్జల..ఆ అప్పులన్నీ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేసినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై రోజుకి రూపాయి పెంచే బీజేపీ కూడా తమపై విమర్శలు చేస్తుందని సజ్జల రామకృష్ణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపుపై జీవీఎల్, సోము వీర్రాజు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్న ఆయన..చేతనైతే బీజేపీ నేతలు రేపటి నుండి పెట్రోల్ రేట్లు పెరగకుండా చూడాలంటూ సూచించారు.

Also read:AP BC Ministers: సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు సమావేశం: పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన