TTD Employees : టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. నెరవేరనున్న సొంతింటి కల

ప్రభుత్వం సేకరించిన 300 ఎకరాల స్థలం, కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు  టీటీడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్ చొరవ..

TTD Employees : టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. నెరవేరనున్న సొంతింటి కల

Tirumala

TTD Employees House : ప్రతొక్కరికీ సొంతిళ్లు ఉండాలని అనుకుంటుంటారు. రూపాయి రూపాయి పోగు వేసుకుని.. ఇంటిని కొనుక్కోవడమో.. స్థలం కొనుకుని ఇంటి నిర్మాణం చేసుకుంటుంటారు. ప్రభుత్వం కూడా ఇందుకు సహాయం చేస్తుంటుంది. ఉద్యోగులు, ఇతరత్రా వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తుంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో పని చేసే ఉద్యోగులకు ఇంటి స్థలాల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారి సొంతింటి కల నెరవేర్చాలని భావించింది. టీటీడీ పాలక మండలి ఓ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Read More : TTD – AP High court: టీటీడీ పాలక మండలిలో సభ్యుల నేర చరితపై మండిపడ్డ హైకోర్టు సిజే

ఈ తీర్మానానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా… 2022, మార్చి 31వ తేదీ గురువారం ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం రూ.61.63 కోట్ల రూపాయల చెక్ ను కలెక్టర్ హరనారాయన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందచేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం వడమాలపేట మండలం అరణ్యం గ్రామంలో ప్రభుత్వం సేకరించిన 300 ఎకరాల స్థలం, కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు  టీటీడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… సీఎం జగన్ చొరవతోనే టీటీడీ ఉద్యోగుల 30 ఏళ్ల కల నేడు నెరవేరిందన్నారు.

Read More : TTD : తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం

ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన నేపథ్యంలో 300 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. టీటీడీలో పనిచేస్తున్న 5 వేల 518 మందికి ఇంటి స్థలాలు దక్కనున్నాయన్నారు. ప్రైవేటు వ్యక్తులు గోశాల ఏర్పాటు, గో ఉత్పత్తుల తయారీకి ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. టీటీడీ పాలక మండలిలో నేర చరితులు ఉన్నారనే దానిపై కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పు పూర్తిపాఠం ఇంకా చూడలేదన్నారు. ఈ కేసు విషయం సీఎం దృష్టికి తీసుకెళుతామని చెప్పారు.