సీఎం, మంత్రిని అడుగుతున్నా : ఎంతెంత ఖర్చు చేశామంటే..బాబు లెక్కలు

  • Published By: madhu ,Published On : December 27, 2019 / 10:52 AM IST
సీఎం, మంత్రిని అడుగుతున్నా : ఎంతెంత ఖర్చు చేశామంటే..బాబు లెక్కలు

రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయాయి. రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశమైంది. హై పవర్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని నిర్ణయాలను వెల్లడించారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ప్రెస్ మీట్‌లో రాజధానికి ఎలా నిధులు తీసుకొచ్చామో..ఎంతెంత ఖర్చు పెట్టామో లెక్కల వివరాలు వెల్లడించారు. 

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ. లక్షా 9 వేల కోట్లు అవుతుంది..ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం (టీడీపీ ) కేవలం రూ. 5 వేల కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారని, దీనికి అధికంగా వడ్డీలు ఖర్చు పెడుతున్నట్లు వ్యాఖ్యానించారని వివరించారు. 

తమ ప్రభుత్వం ఏమి చేసిందంటే..
కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు, అమరావతి బాండ్లు రూ. 2 వేల కోట్లు, హడ్కో కింద 1095 కోట్లు అప్పు, బ్యాంకుల రుణం రూ. 1, 532 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ రూ. 1103 కోట్లు, రూ. 55 కోట్లు ఆన్ లైన్‌లో విరాళం, భూమి అమ్మకం, మౌలిక సదుపాయాల నిధి రూ. 543 కోట్లు, సీఆర్డీఏ బాండ్ల ద్వారా రూ. 26 కోట్లు, వడ్డీలు రూ. 61 కోట్లు, సెక్యూర్టీ డిపాజిట్లు రూ. 64 కోట్లు, సీఆర్డీఏ అద్దెలు రూ. 133 కోట్లు, స్మార్ట్ సిటీ కింద..రూ. 847.3 కోట్లు, హడ్కో నుంచి తీసుకున్న లోన్ రూ. 305.46 కోట్లు..ఇలా మొత్తంగా..రూ. 9 వేల 597 కోట్లు మొబలైజేషన్ చేసినట్లు చెప్పారు. ఇందులో రూ. 5 వేల 674 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

ఖర్చు చేసింది : –
* కన్సార్టీయం ఇచ్చింది :  రూ. 322 కోట్లు 
* ల్యాండ్ పూలింగ్ : రూ. 1311 కోట్లు. 
* రుణాలకు చెల్లించిన వడ్డీ రూ. 329 కోట్లు. 

* రెవెన్యూ వ్యయం రూ. 31 కోట్లు.
* రుణాలు, అడ్వాన్స్‌లు రూ. 346 కోట్లు
* స్మార్ట్ సిటీ (20 ప్రాజెక్టులు) రూ. 847.03 కోట్లు. 
* టిడ్కో ద్వారా 5 వేల 24 నివాసాలకు రూ. 305.46 కోట్లు. 

ఇది గాకుండా..వెయ్యి కోట్లు..విజయవాడ స్మార్ట్ సిటీ, సివరేజీ, గుంటూరులో 500 కోట్లు డబ్బులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రూ. 9 వేల 165. 76 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. 

Read More : అమరావతి ఖర్చులో 10 శాతం పెడితే హైదరాబాద్ తలదన్నేలా వైజాగ్