YCP Leaders : చంద్రబాబుకి పట్టిన గతే లోకేష్ కి పడుతుంది.. తొడగొట్టిన బాలకృష్ణ తోకముడిచి పారిపోయాడు

చంద్రబాబుకు కోర్టు శిక్ష వేస్తే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబే ప్రజలందరినీ క్షమాపణ అడగాలన్నారు.

YCP Leaders : చంద్రబాబుకి పట్టిన గతే లోకేష్ కి పడుతుంది.. తొడగొట్టిన బాలకృష్ణ తోకముడిచి పారిపోయాడు

YCP Leaders Comments Chandrababu

Updated On : September 22, 2023 / 4:28 PM IST

YCP Leaders – Chandrababu : చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టుకి వెళ్లినా హైకోర్టు పరిణామాలే ఉంటాయని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. చంద్రబాబుకి పట్టిన గతే లోకేష్ కి పడుతుందన్నారు. రాజకీయంగా మీరు కోమాలోకి వెళ్తారని పేర్కొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ డెబ్బై షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు డబ్బుని తరలించాడు.. ఈ రోజు చర్చిద్దాం అంటే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కోర్టులో సాక్షాలు ఉన్నాయి కనుకనే చంద్రబాబు జైలుకి వెళ్ళాడని స్పష్టం చేశారు.

తొడగొట్టిన బాలకృష్ణ ఈ రోజు తోకముడిచి పారిపోయాడని ఎద్దేవా చేశారు. జడ్జి ముందు తొడగొట్టి విజిల్ వేయండి అప్పుడు తెలుస్తుందని బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు తుప్పు కాదు నిప్పు అని బాలకృష్ణ ఒప్పుకోలేకపోయాడని పేర్కొన్నారు. చంద్రబాబు సీటు మీద బాలకృష్ణ మనసు పడినట్లు ఉన్నాడని తెలిపారు. పచ్చ చానెళ్లు చంద్రబాబు జాతి పితలాగ చెబుతున్నాయని పేర్కొన్నారు.

Chandrababu CID custody : చంద్రబాబును రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు అనుమతించిన ఏసీబీ కోర్టు

పేద పిల్లల చదువు కోసం కేటాయించిన డబ్బును చంద్రబాబు దోచుకున్నాడని ఆరోపించారు. కోర్టు శిక్ష వేస్తే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబే ప్రజలందరినీ క్షమాపణ అడగాలన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై చర్చ పెట్టగానే తోకముడిచి వెళ్ళి పోయారని ఎద్దేవా చేశారు. బాలకృష్ణకి సినిమాలో తప్పితే బయట మాట్లాడటం చేతకాదన్నారు.

నోట్ ఫైల్స్ మొత్తం మార్చేశారని పేర్కొన్నారు. డిజైన్ టెక్ కి డబ్బులు ఎలా‌ ఇచ్చారని నిలదీశారు. ఢిల్లీకి లోకేష్ ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు తాము సిద్ధమని టీడీపీ రెడీనా అని సవాల్ చేశారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ దొంగ అగ్రిమెంట్ లు క్రియేట్ చేశారని తెలిపారు.

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

చంద్రబాబు అక్రమ అరెస్ట్ అయితే ఎందుకు చర్చకు రావడం లేదని నిలదీశారు. సీమెన్స్ కంపెనీ ఒప్పందం చేసుకోలేదని చెప్పిందని తెలిపారు. చంద్రబాబు పెద్ద మోసకారి అని విమర్శించారు. స్కిల్ ట్రయినింగ్ సెంటర్ లో పెద్ద మోసం జరిగిందన్నారు. ఆధారాలతో సహా చంద్రబాబు దొరికిపోయాడని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని బాగోతాలు బయటపడతాయని చెప్పారు.