Amaravati Land Scam : అమరావతి భూ కుంభకోణం కేసు.. వేగం పెంచిన సీఐడీ
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. సీఆర్డీఏలో పని చేసిన అధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Amaravati Land Scam
Amaravati Land Scam : అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. సీఆర్డీఏలో పని చేసిన అధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రెవెన్యూ రికార్డులు మాయం కావడంపై చెరుకూరి శ్రీధర్ ను(సీఆర్డీఏ మాజీ కమిషనర్) సీఐడీ ప్రశ్నించింది. భూ కుంభకోణం ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాఫ్తు జరుపుతున్నారు.
2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. 2014 అక్టోబర్ నాటి తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను సీఐడీ పరిశీలించింది. ల్యాండ్ పూలింగ్ కు ముందు తుళ్లూరులోని రెవెన్యూ రికార్డులను ఎందుకు పరిశీలించారని సీఐడీ అధికారులు శ్రీధర్ ను ప్రశ్నించారు. రికార్డులను తీసుకెళ్లి గుంటూరులో ఎందుకు పరిశీలించారని అడిగారు.
అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41ని తెచ్చారని, ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్ధంగా జరిగిన అంశాలపై వివరాలు సేకరించే ప్రయత్నం సీఐడీ అధికారులు. 2016 ఫిబ్రవరి 16న భూసేకరణలో రిటనబుల్ ప్లాట్స్ ఇచ్చే ప్రక్రియను అప్పటి మంత్రి నారాయణ ప్రకటించారని సీఐడీ అధికారులకు శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. మరింత లోతుగా విచారణ చేసేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ కౌంటర్ దాఖలు చేయనున్నారు.