Clash For Pigs : పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ.. మున్సిపల్ సిబ్బందిపై పెంపకం దారుల రాళ్ళ దాడి

కాకినాడ జిల్లా పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ జరిగింది. మున్సిపల్ సిబ్బంది, పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిపై పెంపకం దారులు రాళ్ళు విసిరారు.

Clash For Pigs : పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ.. మున్సిపల్ సిబ్బందిపై పెంపకం దారుల రాళ్ళ దాడి

Clash for pigs (1)

Clash For Pigs : కాకినాడ జిల్లా పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ జరిగింది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 300 పందులను మున్సిపల్ సిబ్బంది పట్టించారు. పందులు పట్టుకునేందుకు కడప జిల్లా నుంచి 30 మందిని మున్సిపల్ అధికారులు రంగంలోకి దింపారు. పందులను అడవిలో వదిలేందుకు సిబ్బంది తీసుకుని వెళ్తున్నారు. పందులను తీసుకుని వెళ్తున్న వాహనాలను పెంపకం దారులు అడ్డుకున్నారు.

మున్సిపల్ సిబ్బంది, పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిపై పెంపకం దారులు రాళ్ళు విసిరారు. దీంతో పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిలో నలుగురికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నివారించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

Nandyala: ఆవుల మందను తరిమిన అడవిపందుల గుంపు..భయంతో రిజర్వాయర్ లో చిక్కుకున్న గోమాతలు

పోలీసుల సాయంతో వాహనాలను తీసుకుని వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నం చేసింది. పందుల పెంపకందార్లు తీవ్ర స్థాయిలో రాళ్ళు విసరడంతో సిబ్బంది పరుగులు తీశారు. పెంపకం దారులు పందులను విడిపించుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.