Ap cm jagan : అలా చేయండి.. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి

రష్యా- యుక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రభావం భారత్‌దేశంపై పడింది. మన దేశంలో వినియోగించే పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల్లో అధిక శాతం వరకు ...

Ap cm jagan : అలా చేయండి.. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి

Ap Cm Jagan

Ap cm jagan : రష్యా- యుక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రభావం భారత్‌దేశంపై పడింది. మన దేశంలో వినియోగించే పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల్లో అధిక శాతం వరకు విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అత్యధికంగా యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇరుదేశాల మధ్య యుద్ధం కారణంగా భారత్‌కు వంటనూనెల దిగుమతి తగ్గిపోయింది. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయిల్ ఫెడ్ పేర్కొంటుంది. వంటనూనెల ధరలు భారీగా పెరగడంతో ఏపీలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. ఈ లేఖలో వారికి పలు సూచనలు చేస్తూ అవి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖలు రాశారు. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌కు కొరత ఏర్పడినందున ఆవనూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సన్‌ఫ్లవర్ మాదిరిగా ఉండే ఆవాల నూనె కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధి చేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందని, దిగుమతి చేసుకొనేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారినందున వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కనీసం ఏడాది పాటు ఆవ‌నూనె‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..

మరోవైపు ఏపీలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వినియోగిస్తున్నారు. పామాయిల్‌ను 28శాతం, వేరుశనగ నూనెను 4.3శాతం మంది వాడుతున్నారు. మార్కెట్ లో వంట నూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా, కృత్రిమ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. విజిలెన్స్, పౌరసరఫరా, తూనికలు కొలతల శాఖలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కొరత లేకుండా వంటనూనెల సరఫరా, రోజువారీ ధరలు సమీక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌నూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా రైతు బజార్లలో సరసమైన ధరలకే నూనెలను విక్రయించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.