AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? |AP CM Jagan criticized Chandrababu

AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?

ఎగ్జామ్స్ పేపర్స్ లీక్‌ను సమర్ధించిన ప్రతిపక్షాలను ఎక్కడైనా చూశారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో..

AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?

AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్స్ లీక్‌ను సమర్ధించిన ప్రతిపక్షాలను ఎక్కడైనా చూశారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని, గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత వైసీపీ పాలనకు తేడా గమనించాలని ప్రజలను కోరారు. శుక్రవారం కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో నాలుగో ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో జగన్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించామని, ఇచ్చిన హామీన్నీ నెరవేరుస్తూ వస్తున్నామని జగన్ అన్నారు.

Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..

మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నామని, 1,08,755 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ. 418 కోట్ల సాయం అందించామని, వేట కోల్పోయిన 23,458 మంది మత్స్య కారులకు ఓన్జీసీ పరిహారం అందిస్తున్నామని అన్నారు. జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్య కార కుటుంబాలకు రూ. 11,500 చొప్పున నాలుగు నెలల పాటు ఓన్జీసీ చెల్లించిన రూ.108 కోట్ల పరిహారం అందిస్తున్నామని జగన్ తెలిపారు. మంచి చేశామని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదంటూ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరని.. ఈర్ష, కడుపు మంటకు వైద్యం లేదన్నారు.

Jagananna Vidya Deevena Funds : రూ.709 కోట్లు.. 10.85లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

పరీక్షల పేపర్లు లీక్ ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? ఈఎస్ఐ లో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదనే ప్రతిపక్షంను ప్రజలు ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాంబందులకు అసలు నచ్చదంటూ టీడీపీ నేతలనుద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కొడుక్కి పచ్చి అబద్దాలు, మోసాలతో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రి ఎక్కడా ఉండడని, కోర్టుకి వెళ్లి మంచి పనులను అడ్డుకొనే ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యమని జగన్ విమర్శించారు. ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న రాబందులను ఏమనాలి? వీరిని రాష్ట్ర ద్రోహులు అందామా.. దేశ ద్రోహులు అందామా? అంటూ జగన్ ప్రజలను ప్రశ్నించారు. వక్రబుద్ధి ఉన్న చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని దేవుడిని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు.

×