మరో హామీ నిలుపుకున్న సీఎం జగన్, మత్స్యకార భరోసా పథకం ప్రారంభం, ఒక్కో కుటుంబానికి రూ.10వేలు సాయం

ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. బుధవారం(మే 6,2020) మత్స్యకార భరోసా కార్యక్రమం

  • Published By: naveen ,Published On : May 6, 2020 / 08:12 AM IST
మరో హామీ నిలుపుకున్న సీఎం జగన్, మత్స్యకార భరోసా పథకం ప్రారంభం, ఒక్కో కుటుంబానికి రూ.10వేలు సాయం

ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. బుధవారం(మే 6,2020) మత్స్యకార భరోసా కార్యక్రమం

ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. బుధవారం(మే 6,2020) మత్స్యకార భరోసా కార్యక్రమం
 ప్రారంభించారు. మత్స్యకార భరోసా కింద ఆయా కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని బటన్‌ నొక్కి వారివారి ఖాతాల్లోకి పంపారు. సముద్రంలో వేట సాగించే మత్స్యకారులకు వేట నిషేధభృతిని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. వేట నిషేధం కారణంగా ఉపాధి లేక ఇంట్లోనే ఉన్న మత్స్య కార్మికులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందించింది. 

చేపల పునరుత్పత్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం సముద్రంలో వేటను ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకూ అమలు చేస్తుంది. ఈ 61 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఏప్రిల్‌ 15వ తేదీకి 20 రోజుల ముందే వేట బంద్‌ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ సాయాన్ని ముందుగానే ఇస్తుంది. నిజానికి వేట నిషేధ భృతిని మళ్లీ తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి అందించేవారు.

మత్స్యకార భరోసా కార్యక్రమంలో మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, మత్స్యకారులు పాల్గొన్నారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంతో మాట్లాడారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఆర్థిక కష్టాలు ఉన్నా, మత్స్యకారుల కష్టాలు పెద్దవని భావించి మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.

* వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4వేలు ఇచ్చేవారు
* అదికూడా అందరికీ ఇచ్చేవారు కాదు
* ప్రతి మత్స్యకారుడి కుటుంబంలో వెలుగులు కనిపించని పరిస్థితి
* నా మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా
* వారి బతుకులు మారాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చా
* 2019 మే 30న అధికారంలోకి వచ్చాం
* వేట నిషేధ సమయం ముగిసినా… ఇవ్వకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి
* అయినా సరే నవంబర్ లో మత్స్యకార దినోత్సవం రోజున 2019 మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం
* ముమ్మడివరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
* అప్పట్లో నేను అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు జీఎస్‌పీఎల్‌ డ్రిల్లింగ్‌ వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేదని వాళ్లు చెప్పినప్పుడు… వారికిచ్చిన మాట ప్రకారం 2019 నవంబర్ లో రూ.70.53 కోట్ల పరిహారం చెల్లించాం
* ఇప్పటికీ ఆ డబ్బు ఇంకా రాలేదు
* ఆ డబ్బు కోసం ఎదురుచూడకూండా ఈలోగా మనం చేయాల్సిన మేలు చేశాం

* మత్స్యకారులకు మంచి జరగాలని ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం
* పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారని, మన వాళ్లను అరెస్టు చేశారు
* ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు
* మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీలతో ఒత్తిడి తీసుకొచ్చి వారిని విడుదల చేయించాం
* వారి జీవనం కొనసాగించడానికి ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఆర్థిక సాయం చేశాం
* ఇలా ప్రతి విషయంలోనూ మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశాం
* మొన్న గుజరాత్‌లో 4500మందికిపైగా కరోనా కారణంగా ఇరుక్కుపోతే… వారి ఇబ్బందులు తెలిసిన వెంటనే.. వారికి తోడుగా ఉండడానికి గుజరాత్‌ సీఎం, కేంద్ర మంత్రులతో మాట్లాడి, మన సొంత ఖర్చులతో రూ.3 కోట్లమేర ఖర్చుచేసి.. వారిని తీసుకొచ్చాం
* పరీక్షలు చేసి వారికి ఒక్కొక్కరికి రూ.2వేలు ఇచ్చాం
* వారికి మేలు చేయడానికి ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టాం

* ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15వరకూ ఉన్న వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చేవారు కాదు
* ఇచ్చినా అరకొరగా ఇచ్చేవారు, అందరికీ ఇచ్చేవారు కాదు
* కరోనా కష్టాలు ఉన్నా… ఇవాళ 1,09,231 మంది కుటుంబాలకు రూ. 10.వేలు ఇస్తున్నాం
* డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు చేశాం
* మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే.. రూ. 5లక్షలు సరిపోదని రూ.10 లక్షలు ఇస్తున్నాం
* 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నాం
* ఒక ఫిష్‌ ల్యాడింగ్‌ కేంద్రాన్ని కట్టబోతున్నాం
* వీటికి దాదాపు రూ. 3వేల కోట్లు ఖర్చు అవుతుంది
* మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేస్తాం, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం
* శాశ్వతంగా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్న కార్యక్రమాలు
* గుజరాత్‌కు వలస పోవడమన్నది దశాబ్దాల కాలంగా జరుగుతోంది
* గత ప్రభుత్వంలో మూడే మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు, రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు

Also Read | ఏపీ రైతులకు శుభవార్త : అక్టోబరు నాటికి రైతులకు డెబిట్‌ కార్డులు