CM Jagan to Polavaram: సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పర్యటన

CM Jagan to Polavaram: సీఎం  వైఎస్‌ జగన్‌ పోలవరం పర్యటన

Polavaram Tour

CM Jagan to Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ బయల్దేరనున్నారు. జులై 14న జరగాల్సిన ఈ పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. జులై 19 సోమవారం ఉదయం 10గంటలకు మొదలుకానున్న పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

* గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

* ఉదయం 10గంటల 10 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు.

* 11గంటల 10 నిమిషాలకు నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ పనుల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

* 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.

* 2గంటల 20నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

పర్యటనలో సీఎం జగన్.. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేయాలని భావించి పునాది స్థాయిలో వదిలేసిన వరద మళ్లింపు స్పిల్ వే, వరదతో దెబ్బతిన్న ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ ‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 39 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసింది. కేంద్రం నుంచి నిధులు ఆలస్యమైనా ఆగకుండా పనులు పూర్తి చేశారు. జనవరి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి రూ.వెయ్యి 971 కోట్లు చెల్లింపులు జరిగాయి. పోలవరం పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్డంతో జలాశయంగా రూపుసంతరించుకుంటుంది.

2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఎర్త్ రాక్ పనులు వేగంగా అడుగులు వేస్తున్నాయి.