CM Jagan : సీఎం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. జగన్ ఏం చేశారంటే..

తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీ సీఎం జగన్ ఓ మహిళ పట్ల స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోది. దటీజ్ జగన్ అని నెటిజన్లు కితాబిస్తున్నారు.

CM Jagan : సీఎం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. జగన్ ఏం చేశారంటే..

Cm Jagan

CM Jagan : తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీ సీఎం జగన్ ఓ మహిళ పట్ల స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోది. దటీజ్ జగన్ అని నెటిజన్లు కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుపతిలోని తాజ్ హోటల్ కు వెళుతుండగా, ఓ మహిళ చేతిలో పత్రాలతో సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. దీన్ని జగన్ గమనించారు. వెంటనే ఆయన కాన్వాయ్ ఆపించి ఆ మహిళ సమస్య ఏంటో తెలుసుకోవాలని తన ఓఎస్డీ ధనుంజయరెడ్డిని పంపించారు. సీఎం ఆదేశాలతో ఓఎస్‌డీ ధనుంజయరెడ్డి వెళ్లి బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

ఆమె పేరు విజయకుమారి. కడప జిల్లా రైల్వే కోడూరు వాసి. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ కోసం ఏదైనా ఉపాధి చూపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె నుంచి వివరాలు తీసుకున్న అనంతరం సీఎం జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది.

ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న వారు ఇబ్బంది పెడుతున్నారని.. ఎమ్మెల్యే చెప్పినా తన పని జరగకపోవడంతో.. నేరుగా ముఖ్యమంత్రికి మొర పెట్టుకునేందుకే ఆమె ఇలా చేసినట్లు సమాచారం. తన సమస్యను పరిష్కరించాలని ఆ మహిళ ఓఎస్‌డీని వేడుకుంది. ప్లీజ్ హెల్ప్ సీఎం అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో.. అది గమనించిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఆపి తన ఓఎస్‌డీని బాధితురాలి దగ్గరకు పంపించడం ఆసక్తికరంగా మారింది.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దటీజ్ సీఎం జగన్ అని నెటిజన్లు కితాబిస్తున్నారు. సీఎం ఓఎస్డీ వచ్చి తన సమస్యను తెలుసుకోవడంతో ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసింది. సీఎం జగన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.