CM Jagan : త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతున్నా.. ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తాం

డిసెంబర్ లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

CM Jagan : త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతున్నా.. ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తాం

AP CM Jagan

AP CM YS Jagan Mohan Reddy: ఏపీలో విశాఖ పట్టణం పెద్ద నగరం. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైంది. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం జగన్ విశాఖ పట్టణంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని జగన్ ప్రారంభించారు. అదేవిధంగా రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. విశాఖ పట్టణంకు త్వరలోనే షిప్ట్ అవుతున్నానని, డిసెంబర్ లోపే విశాఖకు మారడం జరుగుతుందని, విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని అన్నారు.

Read Also : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్

రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం. డిసెంబర్ లోపే నేను విశాఖకు షిప్ట్ అవుతా. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది. అభివృద్ధిలో విశాఖ నగరం శరవేగంగా దూసుకుపోతోంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైంది. ప్రతీయేటా 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారని జగన్ చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ఒక్క ఫోన్ కాల్ తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని జగన్ అన్నారు.