Thota Chandrasekhar : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్, సంక్రాంతి తర్వాత మరింత దూకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.

Thota Chandrasekhar : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్, సంక్రాంతి తర్వాత మరింత దూకుడు

Thota Chandrasekhar : భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఆ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించే ప్రక్రియను ముమ్మరం చేశారు. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను స్పీడప్ చేశారు కేసీఆర్. ఇందులో భాగంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని నియమించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను అపాయింట్ చేసినట్లు ఆయన అనౌన్స్ చేశారు.ఇక మాజీమంత్రి రావెల కిషోర్ బాబు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తారని కేసీఆర్ వెల్లడించారు. అంతేకాదు త్వరలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఏపీకి చెందిన సిట్టింగ్ లు కూడా తనకు కాల్ చేసి పార్టీలో చేరతామని చెబుతున్నారని కేసీఆర్ అన్నారు.

Also Read..CM KCR: ఈ గోల్‌మాల్ గోవిందంగాళ్లను మనం భరించాలా?: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

తోట చంద్రశేఖర్ ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చన్నది కేసీఆర్ ప్రణాళికగా పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. తోట చంద్రశేఖర్ గత ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏపీకి కూడా విస్తరించాలన్న సీఎం కేసీఆర్ ప్రణాళికలో భాగంగా సోమవారం తొలి అడుగుపడింది. ఏపీకి చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read..TRS To BRS : ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ .. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే : సీఎం కేసీఆర్

ఏపీ నేతలకు కండువాలు కప్పిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లోకి సాదరంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కాదని, బీఆర్ఎస్ పార్టీ దేశం కోసం అని కేసీఆర్ చెప్పారు. లక్ష్యశుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని స్పష్టం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయాలు వచ్చాయి. అధికారంలోకి రావడం బీఆర్ఎస్ లక్ష్యం కాదు. భారత దేశ పురోగమనాన్ని మార్చడమే బీఆర్ఎస్ లక్ష్యం. తాత్కాలిక ప్రయోజనాల కోసం మతపిచ్చి సృష్టిస్తే దేశం ఏమవుతుంది? మత విద్వేషాల వల్ల హత్యాకాండ జరిగితే దేశం, ప్రజలు ఏమైపోవాలి? ఒక ఊరు, గల్లీ, పేట, రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పుట్ట లేదు. BRS ఈజ్ ఫర్ ఇండియా” అని కేసీఆర్ అన్నారు.