అనంతపురం, కర్నూలులో కరోనా బెల్స్ : కోడుమూరు ఎమ్మెల్యేకు కరోనా

అనంతపురం, కర్నూలులో కరోనా బెల్స్ : కోడుమూరు ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు అధికం అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు చనిపోతున్నారు.

అనంత, కర్నూలు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ జిల్లాలోని ప్రభుత్వ ఆఫీసులకు వైరస్ విస్తరిస్తోంది. పలువురు అధికారుల్లో పాజిటివ్ లక్షణాలు నమోదువుతుండడంతో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వివిధ పనుల మీద వచ్చే వారు భయపడిపోతున్నారు.

అనంత జిల్లాలోని బెలుగుప్ప మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో 16 మందికి వైరస్ సోకింది. ప్రతి రోజు అనంతపురం, కళ్యాణదుర్గం నుంచి బెలుగుప్పకు కొందరు సిబ్బంది వస్తుంటారు. పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టులను అధికారులు వెతికే పనిలో పడ్డారు.

మరోవైపు కర్నూలు జిల్లాలను కరోనా వణికిస్తోంది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ బాబుకు కరోనా వైరస్ సోకడంతో ఆయన్ను క్వారంటైన్ కు తరలించారు. జిల్లాల్లో అనేక ప్రభుత్వాసుఫీసుల్లో వైరస్ విస్తరిస్తోంది. కలెక్టరేట్, కోర్టులు, మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేసే వారికి కరోనా సోకింది.

కలెక్టరేట్ లో ఇద్దరు, కోర్టులో ఏడుగురుకి..మున్సిపల్ ఆఫీసులో ఇద్దరికి..ఇలా అనేక మంది అధికారులకు పాజిటివ్ వచ్చిందని సమాచారం. జిల్లాలో మొత్తం 1555 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారించారు. 40 మందికిపైగా చనిపోయారు. కర్నూలు నగరంలో మొత్తం 729 పాజిటివ్ ఉందని నిర్ధారించారు. ఆందోల్ 335, నంద్యాలో 175, ఆత్మకూరు 22, ఎమ్మిగనూరు 21 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Read: రెండోసారి కరోనా నెగెటివ్ రావడానికి కారణం ఇదే