CPI Narayana : ఒంటరిగా సీఎం జగన్‌‌ని కలవడం చిరంజీవి చేసిన పొరపాటు, సీపీఐ నారాయణ

ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద చిరంజీవి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటి? వారిద్దరి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ.. వన్ టూ వన్ భేటీ ఊహాగానాలకు...

CPI Narayana : ఒంటరిగా సీఎం జగన్‌‌ని కలవడం చిరంజీవి చేసిన పొరపాటు, సీపీఐ నారాయణ

Cpi Narayana

CPI Narayana : సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే వెళ్లి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినీ పరిశ్రమలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి అన్న విషయం విదితమే. ఇంతవరకు ఓకే.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. జగన్ తో భేటీ తర్వాత.. చిరంజీవికి సీఎం జగన్ నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిందనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి.

ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత స్వయంగా చిరంజీవి స్పందించాల్సి వచ్చింది. రాజ్యసభ సీటు ఆఫర్ వార్తలను చిరంజీవి తోసిపుచ్చారు. అందులో నిజం లేదన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే అని స్పష్టం చేశారు. అలాంటి ఆఫర్లు తన దగ్గరికి రావన్నారు. అసలు.. రాజకీయాలకు తాను పూర్తి దూరంగా ఉన్నానని వివరణ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఎవరూ ఆఫర్లు ఇవ్వరని చెప్పారు. తాను ఆఫర్లకు లోబడే వ్యక్తిని కాను అంటూ స్వయంగా చిరంజీవి క్లారిటీ ఇచ్చినా ఈ వ్యవహారం ఇంకా చల్లబడలేదు.

Heart Diseases Risk : గుండె జబ్బులు ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ వాస్తవాలు..!

తాజాగా సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఊహాగానాలపై స్పందించిన నారాయణ.. ఒంటరిగా ముఖ్యమంత్రి జగన్ ని కలవడం చిరంజీవి చేసిన పొరపాటు అన్నారు. ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద చిరంజీవి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటి? ఆయన ప్రశ్నించారు. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదని నారాయణ అన్నారు. వారిద్దరి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ.. వన్ టూ వన్ భేటీ ఊహాగానాలకు అవకాశమిచ్చిందన్నారు. ఇది సినీ పరిశ్రమ సమస్య కాబట్టి ఆయా అసోసియేషన్లను వెంటబెట్టుకుని చిరంజీవి సీఎంను కలిసి ఉండాల్సిందని నారాయణ అన్నారు.

నగరి మండలం అయినంబాకం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో నారాయణ పాల్గొన్నారు. సొంత గ్రామంలో సొంత పొలంలో ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేశారు. కోవిడ్ ప్రబలుతున్న ఈ సమయంలో సొంత గ్రామంలో ఉండడం క్షేమమని భావించి ఇక్కడికి వచ్చానని నారాయణ అన్నారు.

Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవా?

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయిన నేపథ్యంలో కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో చిరంజీవికి వైసీపీ నుంచి సీఎం జగన్ రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ చేశారని తెగ ప్రచారం జరిగింది. దీనిపై తనకు కాస్త సమయం కావాలని చిరంజీవి అన్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ వార్తలను చిరంజీవి ఖండించారు. జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీకి చెక్ పెట్టేందుకు కాపులను తమవైపు తిప్పుకునేందుకు చిరంజీవికి సీఎం జగన్ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారనే విశ్లేషణ కూడా వినిపించింది.