Andhra Pradesh : బీజేపీ విధానాలనే ఏపీలో వైసీపీ అమలు చేస్తోంది : సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్

మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.

Andhra Pradesh : బీజేపీ విధానాలనే ఏపీలో వైసీపీ అమలు చేస్తోంది : సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్

Prakash Karat.. modi, YCP govt

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికారంలో లేకపోయినా వైసీపీ ప్రభుత్వం బీజేపీ విధానాలనే అమలు చేస్తోందని..మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వామపక్షాలు పోరాటం చేపట్టాయి. ఏపీలో బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐలో పోరాటాన్ని వినూత్న కార్యక్రమాల పేరుతో ప్రారంభించాయి.

దీంట్లో భాగంగా ‘మోదీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’, పేరుతో సీపీఎం పోరాటాన్ని ప్రారంభించింది. ఈ కర్యాక్రమంలో పాల్గొన్న సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పార్లమెంట్ లో విపక్షాల గొంతులను అధికార పార్టీ నొక్కేస్తోందని..విమర్శలు చేస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేసి మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు చేస్తోందన్నారు. విపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే దర్యాప్తు సంస్థలతో ఆయా పార్టీల నేతలపై వేధింపులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు.

Andhra Pradesh : ‘మోదీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ : బీజేపీపై వాపపక్ష పార్టీల పోరాటం..

దర్యాప్తు సంస్థలతో విపక్షాలను భయపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని సీబీఐ,ఈడీ దాడులను వేధిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం అసమానతలు పెరిగిపోయాయని..దేశంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడానికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాపపక్షాలు పోరాటం చేస్తున్నాయని కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు పోరాడుతున్నాయని ప్రజల మధ్య అసమానతలు పెరిగేలా మోదీ ప్రభుత్వం చేస్తోందని ఇది సమాజానికి మంచిదికాదని దీనిపై పోరాటానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని ప్రకాశ్ కారత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’, పేరుతో ఏపీ సీపీఎం పోరాటాన్ని చేపట్టింది. బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచార బేరి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ప్రచార బెరీ కార్యక్రమం ఏప్రిల్ 14నుంచి 30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమాన్ని సీపీఎం ఈరోజు ప్రారంభించింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ కారత్ మోదీ విధానాలపై విమర్శలు సంధించారు. అలాగే ‘బీజేపీ హటావో దేశ్ కి బచావో’ అనే పేరుతో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టింది. 26 జిల్లాల్లో ఈ నెల 30 వరకు కార్యక్రమం నిర్వహిస్తోంది.