Andhra Pradesh : ‘మోదీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ : బీజేపీపై వాపపక్ష పార్టీల పోరాటం..

ఏపీలో బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐలో పోరాటాన్ని వినూత్న కార్యక్రమాల పేరుతో షురూ చేశాయి. ‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ప్రచార బెరీ కార్యక్రమం చేపట్టాయి.

Andhra Pradesh : ‘మోదీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ : బీజేపీపై వాపపక్ష పార్టీల పోరాటం..

Communist parties of Andhra Pradesh

Andhra Pradesh : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వామపక్షాలు పోరాటం షురూ చేశాయి. ఏపీలో బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐలో పోరాటాన్ని వినూత్న కార్యక్రమాల పేరుతో ప్రారంభించాయి. దీంట్లో భాగంగా ‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’, పేరుతో సీపీఎం,సీపీఐలు పోరాటాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతు.. బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచార బేరి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం అని తెలిపారు.  ‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ప్రచార బెరీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏప్రిల్ 14నుంచి 30 వరకు ఈ కార్యక్రం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీపీఎం నేతలు పోస్టర్ ను విడుదల చేశారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయనేత ప్రకాష్ కారత్, వినయ్ విశ్వంలు రేపు ప్రచార భేరిలో పాల్గొంటారని శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి పేరుతో మతాల మధ్య విహేచ్పీ, అర్ ఎస్ ఎస్ లు చిచ్చులు పెడుతున్నాయని ప్రజల్ని కులాలు, మతాలు పేరుతు విచ్చిన్నం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు సీపీఎం నేతలు. దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతు జనాల మధ్య మతోన్మోదాన్ని రాజేస్తున్నాయని విమర్శించారు.పాలనలో మోడీ వైఫల్యాలను పక్కన పెట్టీ మతోన్మాదంతో పబ్బం గడపుకోవాలని చూస్తున్నారని..బీజేపీ మనువాధం పేరుతో మహిళలను ఇంట్లోంచి బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్ ఎస్ ఎస్ పాఠశాల పిల్లను మనస్సుల్ని కూడా కలుషితం చేస్తు వారిలో మత బీజాలను నాటుతున్నారని..చిన్నారుల మనస్సుల్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా బీజేపీకి వంతపాడుతు మతాలు, కులాలు అంటూ ప్రజల మధ్య విద్వేషాలను రాజేస్తున్నారని సీపీఎం నేతలు విమర్శించారు.

కేంద్ర, రాష్ట్రాలు కలిసి విశాఖ ఉక్కు పీక నొక్కలని చూస్తున్నారని..విశాఖ ఉక్కు ప్రవేటీకరణ విషయంలో సజ్జ్జల, పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాథ్ లకు ఎటువంటి అవగాహన లేదని అవగాహన లేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి చేతకాని తనం వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం పాల్పడుతోందని జగన్ మోదీని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవటానికి కమ్యూనిస్ట్ ల పై నెపం వేస్తారా? కమ్యూనిస్టుల చరిత్ర మీకు తెలుసా?పోరాటాలకు మారుపేరు అయిన కమ్యూనిస్టులను నెపం వేయటం మీ అవగాహనారాహిత్యానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్రైవేటికరణు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతుంటే తప్పుపడతారా? అంటూ మండిపడ్డారు.విశాఖ ఉక్కును కాపాడుతాము అని ఒక మాట కూడా సజ్జల తన ప్రెస్ మీట్ లో చెప్పలేదని అసలు చెప్పే ధైర్యం మీకు మీప్రభుత్వానికి ఉందా? అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ విశాఖ ఉక్కును ముందు నుంచి పొడుస్తుంటే….మీరు వెనక నుండి మీరు పొడుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

సీపీఐ‘బీజేపీ హటావో దేశ్ కి బచావో’
అలాగే ‘బీజేపీ హటావో దేశ్ కి బచావో’ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తెలిపారు. 26 జిల్లాల్లో ఈ నెల 30 వరకు కార్యక్రమం నిర్వహిస్తామని తొమ్మిదేళ్లుగా నరేంద్ర మోడీ దేశానికి ఏం చేశారని రామకృష్ణ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మోడీ చేసిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని..ప్రజలమీద ధరల భారాలు వేయటమే పనిగా మోదీ ప్రభుత్వ ఉందని విమర్శించారు. ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి ఎక్కడ తగ్గడం లేదని గ్యాస్ సిలిండర్ ధర, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే కేంద్రంలో మంత్రులు ఎందుకు సమాధానం చెప్పారు? అంటూ ప్రశ్నించారు. దేశం దాటి వెళుతున్న వారిలో అందరు గుజరాతీయులే ఒక్క విజయ మాల్యా తప్ప అంటూ ఎద్దేవా చేశారు. విశాఖ లోని స్టీల్ ప్లాంట్ ను అదానీకి అప్పగించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులు వేస్తున్నాయని..నరేంద్ర మోడీనీ గద్దె దింపడానికి జరిగే పొరటాల్లో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు.