Amaravati Farmers : అమరావతి రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్.. హైకోర్టు తీర్పుతో తిరిగి ప్రారంభం

ఈ సమయంలో రిజిస్ట్రేషన్స్‌ను జగన్‌ సర్కార్‌ నిలిపివేయగా.. రైతులు, అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్స్‌ చేయాలని ఆదేశించింది.

Amaravati Farmers : అమరావతి రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్.. హైకోర్టు తీర్పుతో తిరిగి ప్రారంభం

Amaravati Farmers

Updated On : March 8, 2022 / 1:02 PM IST

CRDA plot registration : అమరావతి రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ తిరిగి ప్రారంభమైంది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్‌ చేసింది. రాజధాని కోసం 28వేల 587 మంది రైతులు భూములు ఇచ్చారు. మొత్తం దాదాపు 35వేల ఎకరాల భూమిని అందించారు. దీనికి ప్రతిగా వారికి ప్లాట్లను ఇచ్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాజధాని కోసం 28,587 మంది రైతులు.. 34,385 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. రైతులకు 38,282 నివాస, 26,453 వాణిజ్య ప్లాట్లను ప్రభుత్వం ఇవ్వాల్సింది. దీనిలో 40,378 ప్లాట్లను గత ప్రభుత్వం రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసింది.

Amaravati: అమరావతి గ్రామ సభల్లో స్థానికుల నిరసన.. కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వినతిపత్రం

ఈ సమయంలో రిజిస్ట్రేషన్స్‌ను జగన్‌ సర్కార్‌ నిలిపివేయగా.. రైతులు, అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్స్‌ చేయాలని ఆదేశించింది. దీంతో తిరిగి ఆ ప్రక్రియను సీఆర్‌డీఏ ప్రారంభించింది. మిగిలిన 24,357 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ను తాజాగా తిరిగి ప్రారంభించింది.