Amaravati: అమరావతి గ్రామ సభల్లో స్థానికుల నిరసన.. కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వినతిపత్రం

అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించి.. రాజధాని గ్రామాల్లో.. గ్రామసభల నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి వారం పాటు.. గ్రామసభలు నిర్వహించనున్నారు.

Amaravati: అమరావతి గ్రామ సభల్లో స్థానికుల నిరసన.. కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వినతిపత్రం

Amaravati (2)

protesting in amaravati village meetings : అమరావతిని కార్పోరేషన్‌గా మార్చడంపై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో కొన్ని గ్రామాల ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. మంగళగిరి మండలం.. కురగల్లులో గ్రామసభకు హాజరైన ప్రజలు నిరసన తెలిపారు. రాజధానిని అభివృద్ధి చేసి సీఆర్డీయేలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఆర్డీఏను విడదీసేందుకే గ్రామాలను విభజిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తున్నట్టు అధికారులకు గ్రామస్తులు వినతిపత్రం అందించారు. భూములను అభివృద్ధి చేసి సీఆర్డీఏను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించి.. రాజధాని గ్రామాల్లో.. గ్రామసభల నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి వారం పాటు.. గ్రామసభలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై.. గ్రామసభల్లో ప్రజలు తెలియజేసే అభిప్రాయాలను, అభ్యంతరాలను.. అధికారులు నమోదు చేసుకోనున్నారు. ముందుగా.. గ్రామసభలో తీర్మానం చదివి వినిపించి.. దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసుకుంటారు. పంచాయతీ ఆఫీసులు, పాల కేంద్రాలు, పాఠశాల ప్రాంగణాల్లో.. గ్రామసభలు నిర్వహించనున్నారు.

Car Accident : జగిత్యాల జిల్లాలో కారు ప్రమాదం విషాందాంతం.. నీటిలో మునిగి ఇద్దరు మృతి

అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కాకుండా.. కేవలం 19 గ్రామ పంచాయతీలను మాత్రమే కలిపి.. అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపైనే.. ఇప్పుడు రచ్చ నడుస్తోంది. రాజధాని గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 19 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ జరిపిన 29 గ్రామాలతో కలిపి.. క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను.. గ్రామసభల్లో అడ్డుకునేందుకు అమరావతి ప్రజలు సిద్ధమయ్యారు.