Car Accident : జగిత్యాల జిల్లాలో కారు ప్రమాదం విషాందాంతం.. నీటిలో మునిగి ఇద్దరు మృతి

ప్రసాద్, రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టి.. కాల్వలో పడిపోయింది.

Car Accident : జగిత్యాల జిల్లాలో కారు ప్రమాదం విషాందాంతం.. నీటిలో మునిగి ఇద్దరు మృతి

Car Accident (2)

Two killed in car accident : జగిత్యాల జిల్లాలో కారు ప్రమాదం విషాందాంతంగా మారింది. కాకతీయ కాల్వలో కారు మునిగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న రేవంత్, ప్రసాద్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన కారును రెస్క్యూ సిబ్బంది కొద్దిసేపటి క్రితమే బయటికి తీశారు. ఈ ఘటన మెట్ పల్లి మండలం వెల్లుల్ల దగ్గర చోటు చేసుకుంది. మృతులు రేవంత్, ప్రసాద్ లను మెట్ పల్లికి చెందిన వారుగా గుర్తించారు. వీరి మృతదేహాలను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిన్న రాత్రి కారు ప్రమాదవశాత్తు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన కారు.. కాల్వలో పడిపోయింది. సోమవారం రాత్రి ప్రసాద్ (42), రేవంత్ (27) కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. మార్గం మధ్యలో కాకతీయ కాల్వ వంతెన దగ్గరకు రాగానే కారు కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టంది. దీంతో అదుపు తప్పిన కారు కాల్వలో పడిపోయింది. ప్రమాద సమయంలో కాల్వలో 14 ఫీట్ల ఎత్తులో నీటి ప్రవాహం కొనసాగుతోంది.

Jammu Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

నిన్న సాయంత్రం స్థానికులు కారు కాల్వలో పడిపోయినట్లుగా గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీరాంసాగర్ నుంచి విడుదలయ్యే నీటిని ఆపేసి, గాలింపు చర్యలు కొనసాగించారు. కొద్ది సేపటి క్రితమే జాలర్ల సహాయంలో కారును గుర్తించారు. ప్రస్తుతం భారీ క్రెయిన్ సహాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మెట్ పల్లి ఎంట్రీ పాయింట్ వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎంట్రీ పాయింట్ వద్ద కారు వెల్లుల్లి వైపు వస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, కారు గ్రామానికి రాలేదు. దీంతో ఏం జరిగిందన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది.

కారుకు సంబంధించిన సైడ్ మిర్రర్స్ ఘటనాస్థలంలో పడి ఉండటంతో కారు కాల్వలో పడిపోయినట్లు, అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. కారులో ఉన్న రేవంత్, ప్రసాద్ లు నీటిలో పడటంతో మృతి చెందారు. వారి మొబైల్స్ సోమవారం రాత్రి నుంచి పని చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్వలో కారును గుర్తించి, అందులో ఉన్న ఇద్దరు మృతదేహాలను గుర్తించి, వెలికి తీశారు.