Cricketer Ambati Rayudu: ఏపీ రాజకీయాల్లోకి క్రికెటర్ అంబటి రాయుడు..! ఐపీఎల్ తరువాత ఎంట్రీకి రంగం సిద్ధం?

క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్‌లో పెరిగారు. అయితే, అతను పుట్టింది ఏపీలోని గుంటూరు జిల్లాలో. అందుకే అంబటి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలు‌సైతం అందాయట.

Cricketer Ambati Rayudu: ఏపీ రాజకీయాల్లోకి క్రికెటర్ అంబటి రాయుడు..! ఐపీఎల్ తరువాత ఎంట్రీకి రంగం సిద్ధం?

Cricketer Ambati Rayudu

Cricketer Ambati Rayudu: క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు.. క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. తెలుగు వాడిగా టీమిండియా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. పలుసార్లు టీమిండియా గెలుపులోనూ అంబటి కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఐపీఎల్ -2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాయుడు.. ఐపీఎల్ టోర్నీ పూర్తయిన తరువాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అంబటి స్పందించారు. ‘ది హిందూ’ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ అరంగ్రేటంపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారని రాయుడు వెల్లడించారు.

Harish Rao : ఇంత డెవలప్‌మెంట్ దేశంలో ఎక్కడా చూడలేదు.. సీఎం కేసీఆర్‌పై క్రికెటర్ రాయుడు, హీరో నాని ప్రశంసల వర్షం

అంబటి రాయుడు హైదరాబాద్‌లో  పెరిగారు. అయితే, అతను పుట్టింది ఏపీలోని గుంటూరు జిల్లాలో. అందుకే అంబటి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలు సైతం అందాయట. తగిన సమయంలో నా నిర్ణయాన్ని వెల్లడిస్తానని సదరు రాజకీయ పార్టీలకు చెప్పినట్లు అంబటి రాయుడు అన్నారు. చదువుకున్న యువత మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి రావాలని, ఈ ఆలోచనే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిందని రాయుడు చెప్పారు. అయితే, అతను ఇప్పట్లో క్రికెట్ నుంచి రిటైర్ కావాలని అనుకోవటం లేదట. ఐపీఎల్ లో ఎక్కువ కాలం సేవలందించిన క్రికెటర్లలో అంబటి రాయుడు ఒకరు. ఐపీఎల్ లో 190కిపైగా మ్యాచ్ లు ఆడారు.

Ambati Rayudu : గాల్లోనే సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్.. అంబటి అదరహో.. షాకింగ్ వీడియో..!

ప్రజాసేవలో ఉండాలనే కోరిక తనను రాజకీయాలవైపు ప్రేరేపిస్తుందని అంబటి చెప్పారు. నా క్రీడా జీవితం కారణంగా సివిల్ సర్వీసెస్ లో ప్రవేశించాలనే నా కలను నెరవేర్చుకోలేక పోయాయనని, అయితే, రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు అంబటి అన్నారు. అయితే, అంబటి రాయుడు ఏ పార్టీలో చేరుతారనే విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అతను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాఅని వైసీపీలోకి వెళ్లడు అనేందుకుకూడా అవకాశం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న టాక్.

AP Politics : 175 సీట్లలో పోటీ చుట్టూ ఏపీ రాజకీయం

తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో కొద్దిమందే ఉన్నారని చెప్పొచ్చు. ఈ విషయంలో తొలుత చెప్పుకోవాల్సిన పేరు అహ్మద్ అజారుద్దీన్. గతంలో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించారు. సుదీర్ఘకాలం టీమిండియాలో కీలక ప్లేయర్ గా కొనసాగారు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దికాలంకు కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. టీమిండియా తరపున ఆడకపోయిన క్రికెటర్ గా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తింపు ఉంది. రంజీ ట్రోపీలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగానూ కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.