YCP Crime Leaders: మద్యం మత్తులో పోలీసులుపై వీరంగం సృష్టించిన వైసీపీ నేతలు

అధికార పార్టీ నేతలం మాకు మీరు ఎదురు చెప్తారా అంటూ మద్యం సేవించి పోలీసులు పై తిరగబడ్డాడు ఓ వైసీపీ నేత. విశాఖ జిల్లా మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన

YCP Crime Leaders: మద్యం మత్తులో పోలీసులుపై వీరంగం సృష్టించిన వైసీపీ నేతలు

Police

Updated On : February 20, 2022 / 1:37 PM IST

YCP Crime Leaders: అధికార పార్టీ నేతలం మాకు మీరు ఎదురు చెప్తారా అంటూ మద్యం సేవించి పోలీసులు పై తిరగబడ్డాడు ఓ వైసీపీ నేత. విశాఖ జిల్లా మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా మాకవరపాలెం ఆర్ఆర్ రెస్టారెంట్ లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి గొడవ పడ్డారు. ఎంతకూ గొడవ సద్దుమణగకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మద్యం సేవించి ఉన్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పైనే మందుబాబులు తిరగబడ్డారు.

Also read: Somu Veerraju: గృహ నిర్మాణాలపై బొత్స, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలి: సోము వీర్రాజు

గోడపడ్డ వారిలో ఒకరు పాకలపాడు వైసీపీ నేత, ఎంపీటిసి భర్త యళ్ల నాయుడు ఉండగా, మరొకరు విద్యా కమిటీ చైర్మన్ నానాజీ ఉన్నారు. వీరు తప్పతాగి పోలీసులుపై వీరంగం సృష్టించారు. పోలీస్ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని అసభ్యపదజాలంతో దూషించారు. ద్విచక్ర వాహనంపై పోలీసు కూర్చుని ఉండగానే.. మద్యం బాటిల్ పగలకొట్టి, సీటుపై బిర్యానీ పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారపార్టీ నేతలం, మాకు ఎమ్మెల్యే తెలుసు, మీరు మమ్మల్ని ఏమి చెయ్యలేరు అంటూ వైసీపీ నేతలు హల్చల్ చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. పోలీసులను లెక్కచేయని స్థితిలో అధికార పార్టీ నేతల ఆగడాలపై సామాన్యుల గతేంటంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: Students issues in AP: పీజీ విద్యార్ధులను హాస్టల్ నుంచి బయటకు పంపిన సిబ్బంది