Somu Veerraju: గృహ నిర్మాణాలపై బొత్స, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలి: సోము వీర్రాజు

రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు

Somu Veerraju: గృహ నిర్మాణాలపై బొత్స, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలి: సోము వీర్రాజు

Somu

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన పేదల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష 80 వేల సబ్సిడీనే దిక్కయిందని అన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ, ఎంత ఖర్చు చేసిందో చూపాలని మంత్రి బొత్సకు సోమువీర్రాజు సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన సొమ్ముతో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని.. అయితే వైసీపీ నేతలు మాత్రం.. ఆ ఇళ్లు తామే ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని సోమువీర్రాజు విమర్శించారు. ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కులేదు వారికి లేదని దుయ్యబట్టారు.

Also read: Pawan Kalyan: నేడు నరసాపురంలో జనసేనాని సభ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి గానూ.. PMAY కింద రూ.4 వేల కోట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందని సోమువీర్రాజు గుర్తు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడం వల్లనే బియ్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడిన ఘనత దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయి, ప్రస్తుత ప్రధాని మోదీకే దక్కుతుందని సోమువీర్రాజు అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించిందని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్న వామపక్షాలు…స్థానిక సమస్యలపై ఎందుకు గొంతెత్తడం లేదని సోమువీర్రాజు ప్రశ్నించారు. మోదీని విమర్శించడానికే పనిగా పెట్టుకున్న వామపక్షాలు…చైనా, రష్యాకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే స్పష్టమైన ఇసుక విధానం తీసుకువస్తామని సోమువీర్రాజు హామీ ఇచ్చారు.

Also read: Raja Singh : రాజాసింగ్ పై ఈసీ సీరియస్.. కేసు నమోదు చేయాలని ఆదేశం