Eluru Lok Sabha Constituency : ఏలూరులో పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు….క్లీన్‌స్వీప్‌ చేయడమే టార్గెట్‌గా అధికార పార్టీ అడుగులు

నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకట ప్రతాప్ అప్పారావు.. శక్తివంతమైన కేడర్ ఏర్పాటు చేసుకున్నారు.

Eluru Lok Sabha Constituency : ఏలూరులో పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు….క్లీన్‌స్వీప్‌ చేయడమే టార్గెట్‌గా అధికార పార్టీ అడుగులు

eluru

Eluru Lok Sabha Constituency : ఏలూరు పార్లమెంట్‌ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీలు వైసీపీ ఖాతాలోనే ఉండగా.. మరోసారి క్లీన్‌స్వీప్‌ చేయడమే టార్గెట్‌గా అధికార పార్టీ అడుగులు వేస్తోంది. ఐతే ఫ్యాన్ పార్టీకి ఝలక్ ఇచ్చి.. ఏలూరులో పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలన్నీ జనాల్లో కనిపిస్తున్నాయ్. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. వైసీపీ, టీడీపీకి దీటుగా బీజేపీ కూడా అడుగులు వేస్తుండడంతో.. ఏలూరు పార్లమెంట్‌ రాజకీయంలో మంటలు రేగుతున్నాయ్. ఇంతకీ ఏ పార్టీ బలం ఏంటి.. ఏ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది.. వైసీపీ మళ్లీ క్లీన్‌స్వీప్ చేస్తుందా.. టీడీపీకి ఇబ్బందిగా మారిన పరిణామాలు ఏంటి.. ఏలూరు లోక్‌సభ పరిధిలో జనసేన ప్రభావం ఎలా ఉండబోతోంది..

eluru

eluru

ఏలూరు లోక్‌సభ పరిధిలో జనసేన ప్రభావం ఎంత ? వైసీపీ దూకుడుకు కళ్లెం వేసే టీడీపీ వ్యూహం ఏంటి ?

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు తెలివిగా వ్యవహరిస్తుంటారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే చేయగలుగుతారో వారికే పట్టం కడుతుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇంటికి పంపించేస్తారు. ఏలూరులో కోటగిరి శ్రీధర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు మీద.. లక్షా 65వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏలూరులో పార్లమెంట్‌ పరిదిలో రాజకీయాలు చకచకా మారుతున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు… ఉహకందని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరితోపాటు జాతీయ పార్టీ బీజేపీ కూడా ఏలూరు బరిలో దిగేందుకు సిద్ధం అవుతోంది. ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్న నేతను పోటీ చేయించాలని ప్లాన్ చేస్తోంది.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్.. పార్టీ శ్రేణులకు, ప్రజలలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో విజయం సాధించినా.. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో శ్రీధర్ చొరవ చూపించడం లేదనే భావనలో వైసీపీ అధిష్టానం ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యగా ఉన్న కొల్లేరు అభివృద్ధికి సంబంధించి.. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో ఎంపీగా శ్రీధర్ విఫలం అయ్యారనే చర్చ జరుగుతోంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయాయ్. బాధితులకు అందాల్సిన నష్టపరిహారం సాధించడంలో ఎంపీ శ్రీధర్ సక్సెస్ కాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని అధిష్టానం ఆలోచిస్తోందని.. వైసీపీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. ప్రజాబలం, ధనబలం ఉన్న నేతలను పార్లమెంట్‌ బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

టీడీపీ నుంచి పోటీకి సిద్ధమైన మాగంటి బాబు….బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చిన్నం రామకోటయ్య

టీడీపీ నుంచి మాగంటి బాబు మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. అధిష్టానం నుంచి సూచనప్రాయంగా అనుమతి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మాగంటి బాబు దూకుడు పెంచారు. ఎంపీ శ్రీధర్‌ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారన్న విషయాన్ని ఆయుధంగా మార్చుకొని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం మొదలుపెట్టి.. వైసీపీ సర్కార్ వైఫల్యాలను జనాలకు వివరిస్తున్నారు. ఇద్దరు కుమారుడు చనిపోవడంతో.. తనకు రాజకీయ వారసత్వం లేదని.. జనాల కోసమే పని చేస్తానని చెప్తూ సానుభూతి అస్త్రాన్ని సంధిస్తున్నారు మాగంటి బాబు. బీజేపీ నుంచి గారపాటి చౌదరి.. ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తపన ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తనదైన శైలిలో జనాలకు మరింత చేరువ అయ్యేందుకు వ్యూహలు అమలు చేస్తున్నారు. పోటీకి సంబంధించి బీజేపీ హైకమాండ్ నుంచి గారపాటికి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. నూజివీడుకు చెందిన చిన్నం రామకోటయ్య కూడా బీజేపీ తరఫున టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. హైకమాండ్‌ ముందు ఇప్పటికే తన మనసులో మాట బయటపెట్టినట్లు టాక్‌.

ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో ఏలూరు అసెంబ్లీతో పాటు ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు సెగ్మెంట్‌లు ఉన్నాయ్. పోలవరం ఎస్టీ రిజర్వ్‌డ్‌ కాగా.. చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్. మిగిలినవి జనరల్‌ స్థానాలు. ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయ్.

NANI

NANI

ఏలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆళ్ల నానిని ఇబ్బందిపెడుతోన్న వర్గపోరు

ఏలూరు అసెంబ్లీలో ఆళ్ల నాని సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన ఆళ్ల నాని.. వచ్చే ఎన్నికల్లోనూ విక్టరీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఐతే వర్గపోరు అధికార పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఆళ్ల నాని వర్సెస్ ఏలూరు మేయర్‌ నూర్జహాన్ భర్త పెదబాబు వర్గాల మధ్య గ్రూప్‌ వార్ పీక్స్‌కుచేరింది. 2024లో పెదబాబు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండువర్గాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. పార్టీ పరువును బజారున పడేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఏలూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని.. ఎమ్మెల్యే వర్గం నేతలే ఆరోపణలు గుప్పించడం.. ప్రతిపక్షానికి బలంగా మారుతోంది. టీడీపీలో ఏలూరు నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికకరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సోదరుడు చంటి… టికెట్ తనకే ఖాయం అనే ఆశతో కనిపిస్తున్నారు. ఐతే బుజ్జి భార్యకు లేదా అల్లుడికి టికెట్ ఇవ్వాలని మరోవర్గం డిమాండ్ చేస్తోంది. జనసేనతో పొత్తు ఖరారయితే.. బుజ్జి అల్లుడుకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌కు ఆయన బంధువు కావడం కలిసొచ్చే అంశంగా మారనుంది. ఐతే జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు దూకుడు మీద కనిపిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ జరిగితే.. ఆళ్లనానికి అది ప్లస్ అవుతుంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి గట్టి పోటీ తప్పదు.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

abbaiah, chinthamaneni

abbaiah, chinthamaneni

దెందులూరు నుండి తిరగి పోటీకి సిద్ధమౌతున్న అబ్బయ్య చౌదరి…. ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోనే ఉంటున్న టిడిపి నేత చింతమనేని

దెందులూరు అసెంబ్లీకి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కొటారు అబ్బయ్య చౌదరి ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై 16వేలకు పైగా ఓట్ల తేడాతో అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున అబ్బయ్య చౌదరినే పోటీ చేయబోతున్నారు. ఇంటింటికి తిరుగుతున్న ఆయన.. జనాల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఇసుక మాఫియా, కొల్లేరు అక్రమ తవ్వకాల విషయంలో ఆరోపణలు వినిపించడం కాస్త మైనస్ అయ్యే చాన్స్ ఉంది. ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోనే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. దెందులూరులో జనసేనకు అంతగా పట్టు లేదు. ఐతే చింతమనేని దూకుడుకు కళ్లెం వేయాలని.. సొంత పార్టీలోనే కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలుస్తుండడంతో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాల మనసు గెలుచుకునేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

nageswarao, kamineni

nageswarao, kamineni

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

కైకలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు మరోసారి టిక్కెట్ ఖాయం…. పోటీకి సుముఖంగా ఉన్న కామినేని శ్రీనివాస్‌

కైకలూరు రాజకీయం ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటుంది. దూలం నాగేశ్వరరావు ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా సిట్టింగ్ ఎమ్మెల్యే జనాల్లోకి వెళ్తున్నారు. గడపగడపకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సర్వేలో.. దూలం ఐదో స్థానంలో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ కన్ఫార్మ్‌గా కనిపిస్తోంది. టీడీపీ నుంచి జయ మంగళ వెంకటరమణ.. మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తు కుదిరితే.. టీడీపీకి కాకుండా మరోపార్టీకి టికెట్ కేటాయిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సైకిల్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్ టికెట్ రేసులో ఉన్నారు. ప్రతిపక్షాల డైలమాను సిట్టింగ్‌ ఎమ్మెల్యే దూలం… తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Veeranjaneyulu,puppala vasu

Veeranjaneyulu,puppala vasu

ఉంగుటూరులో వివాదరహితుడిగా ఎమ్మెల్యే పుప్పాల వాసు….టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పోటీకి సన్నద్ధం

ఉంగుటూరు అసెంబ్లీలో పుప్పాల వాసుబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు, కమ్మ, బీసీ సామాజికవర్గాల ఓటర్లు.. ఇక్కడ సమానంగా ఉన్నారు. వైసీపీ నుంచి వాసు బాబు మరోసారి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా.. వాసుబాబు ముందుకు సాగుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనసేన, టీడీపీ ఆసక్తి చూపిస్తున్నాయ్. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రయత్నాలు చేస్తుంటే.. జనసేన కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని ప్లాన్ చేస్తోంది. పొత్తు కుదిరితే.. ఉంగుటూరు నుంచి ఏ పార్టీ తరఫున ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

READ ALSO : Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

apparao, abv, mudraboina

apparao, abv, mudraboina

నూజివీడులో బలంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు…వర్గపోరుతో సతమతమౌతున్న టీడీపీ

నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకట ప్రతాప్ అప్పారావు.. శక్తివంతమైన కేడర్ ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అధికార పార్టీ బలంగా కనిపిస్తున్నా.. గతంతో కంపేర్ చేస్తే.. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తోంది. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే విమర్శ ఉంది. అటవీ భూములు ఎక్కువగా ఉన్నా.. ఈ ప్రాంతం పారిశ్రామికంగా డెవలప్‌ కాలేదు. మామిడి తోటలకు నూజివీడు ఫేమస్ అయినా.. పంటను సకాలంలో అమ్ముకోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. పంటను నిలువ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఐతే ట్రిపుల్ ఐటీ, మామిడి పరిశోధన కేంద్రం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారనే పేరు.. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ ప్లస్‌గా మారనుంది. టీడీపీ తరఫున ముద్రబోయిన వెంకటేశ్వర రావు ఇంచార్జిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్‌గా కనిపిస్తున్నా.. టీడీపీలో టికెట్ ఫైట్‌ ఎక్కువగా ఉంది. వర్గపోరు కారణంగా ఇక్కడ టీడీపీకి విజయం దూరం కాగా.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. కమ్మ సామాజికవర్గానికి కొందరు నేతలు.. ఎన్ఆర్‌ఐలను తెరమీదకు తీసుకువస్తున్నారు. ముద్రబోయినకు కాకుండా.. పర్వతనేని గంగాధరరావుకు టికెట్ ఇవ్వాలని కొందరు నేతలు చంద్రబాబు ముందే చెప్పిన సందర్భాలు ఉన్నాయ్. ఇక అటు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. .. పార్టీలో విభేధాలను పక్కనపెట్టకపోతే.. అది వైసీపీకి ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. అటు బీజేపీ, జనసేన కూడా.. నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయ్.

srinivas, bala raju

srinivas, bala raju

పోలవరంలో బాలరాజుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి

పోలవరం ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. తెల్లం బాలరాజు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి భారీగా కనిపిస్తోంది. ప్రధానంగా నిర్వాసితుల సమస్యలు తీర్చడంలో సర్కార్ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయ్. విలీన మండలాలు అయిన వేలేరుపాడు, కుక్కునూరు మండలంలోని పలు గ్రామాల్లో జనాలకు ఇప్పటికీ పునరావాసం చూపలేదు. నిర్వాసితుల కాలనీల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయ్. వీటికితోడు బాలరాజుపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గోదావరి ఇసుక ర్యాంపులు, మండలాల్లో మట్టి తవ్వకాల పనులను అనుచరులకు మాత్రమే ఎమ్మెల్యే ఇస్తున్నారని.. సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ తరఫున బోరగం శ్రీనివాస్ ఇంచార్జిగా ఉన్నారు. శ్రీనివాస్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు కూడా టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే మొడియం లక్ష్మణరావు కుటుంబీకులు కూడా… తమ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ కావాలని అధిష్టానానికి సందేశాలు పంపుతున్నారు. దీంతో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక జనసేన తరఫున చిర్రి బాలరాజు పేరు వినిపిస్తోంది. బీజేపీకి ఇక్కడ పెద్దగా ఆదరణ లేకపోయినా.. ప్రజాసమస్యలపై యాక్టివ్‌గా పోరాటం చేస్తోంది. కమలం పార్టీ తరఫున బొరగం వెంకటలక్ష్మి టికెట్ రేసులో ఉన్నారు.

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

sujatha, elija

sujatha, elija

చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు ఇబ్బందిగా వర్గపోరు…

చింతలపూడిలో ఎలిజా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలిజాను వర్గపోరు ఇబ్బంది పెడుతోంది. సొంత పార్టీకి చెందిన నేతలే.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. టీడీపీలోనూ టికెట్‌ ఫైట్‌ భారీగా కనిపిస్తోంది. మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు… జయరాజు రాజారావు, మరో ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థి టికెట్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు ఉన్నా లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని జనసేన, బీజేపీ ఫిక్స్ అయ్యాయ్. నియోజకవర్గంలోని బొగ్గు నిక్షేపాలపై గతంలో పరీక్షలు నిర్వహించినా.. వాటిని వెలికితీసేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎలిజా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది జనాల్లో విమర్శలు వినిపిస్తున్నాయ్. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలని ఫిక్స్ అయింది.

రోజుకో రకంగా మారుతున్న రాజకీయంతో.. ఏలూరు పార్లమెంట్‌లో పరిణామాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయ్. 2024 ఎన్నికల్లో నువ్వా నేనా అనేలా నాయకుల మధ్య, పార్టీల మధ్య యుద్ధం కనిపించడం ఖాయం అనిపిస్తోంది. 2024లో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎవరు పోటీ చేయబోతున్నారన్నది ముందుగానే ప్రకటిస్తున్న జగన్.. ఎంపీ అభ్యర్థులను ముందే ఖరారు చేస్తే బాగుంటుందనే చర్చ వైసీపీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఐతే వివిధ రకాల సర్వేలు చేయించుకుని తగిన రిపోర్టులతో సిద్ధంగా ఉన్న జగన్‌.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించాలని భావిస్తున్నారు. ఇక అదే సమయంలో టీడీపీ కూడా తగ్గేదే లే అంటోంది. వైసీపీకి ఈసారి గట్టి షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. ఇక అటు జనసేన ఎవరితో పొత్తులో ఉంటుందన్నది వచ్చే ఎన్నికల్లో మరింత కీలకంగా మారనుంది.