Chikoti Praveen Casino : చీకోటి ప్రవీణ్ క్యాసినోకి వెళ్లిన ప్రజా ప్రతినిధులు వీరేనా ?

క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది. 

Chikoti Praveen Casino : చీకోటి ప్రవీణ్ క్యాసినోకి వెళ్లిన ప్రజా ప్రతినిధులు వీరేనా ?

chikoti praveen

Updated On : August 6, 2022 / 1:21 PM IST

Chikoti Praveen Casino :  క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది.  చీకోటి ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులు, క్యాసినో అంశంలో అతనితో చాటింగ్ చేసిన నేతల లిస్టు ఈడీ అధికారులు  రెడీ చేశారు.

రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు 20మంది ప్రజాప్రతినిధులతో చీకోటికి లింక్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ వాట్సప్ చాట్ ను రికవరీ చేసిన ఈడీ, అతను నిర్వహించిన క్యాసినోకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించింది. చీకోటికి టచ్ లో ఉన్న 12 మంది ప్రజా ప్రతినిధులకు. 20 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు అందచేసినట్లు సమాచారం.

సోమవారం ఆగస్ట్ 8వ తేదీ నుంచి వారిని ఈడీ విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. హైదరాబాద్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ప్రజాప్రతినిధి సోదరుడు.. హైదరాబాద్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ప్రజాప్రతినిధి,.. మెదక్‌ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్..ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. చీకోటి లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఈడీ ముందుకు హాజరైతే వీరెవరనేది తెలుస్తుంది.