CM Jagan-RGV meet : సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ .. కారణం అదేనా..?!

ఏపీ సీఎం జగన్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

CM Jagan-RGV meet : సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ .. కారణం అదేనా..?!

Film director ram gopal varma meets with Andhra pradesh cm jagan

CM Jagan-RGV meet : ఏపీ సీఎం జగన్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.సుమారు 45 నిమిషాలపాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు.వీరిద్దరి భేటీ అటు రాజకీయంగాను..ఇటు సిని పరిశ్రమలోను ఆసక్తికరంగా మారింది.వీరిద్దరు ఎందుకు సమావేశమయ్యారు? ఏఏ అంశాలపై మాట్లాడుకున్నారు. అనే విషయం ఉత్కంఠగా మారింది.

కాగా ఏపీలో మూడు రాజధానుల అంశం హీట్ పుట్టిస్తోంది. ఈక్రమంలో వీరిద్దరి సమావేశం కావటం విశేషంగా మారింది. సంచలన సినిమాలు తీస్తు..వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండేవర్మ సీఎం జగన్ తో భేటీ కావటం ఆసక్తి కలిగిస్తోంది. ఏపీలో జరుగుతున్న పలు కీలక అంశాలపై వర్మ సినిమా తీస్తారా? అనే విషయంపై ఉత్కంఠ కలిగిస్తోంది.

కాగా..గత ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా..వైసీపీకి రాజకీయంగా అంతో ఇంతో కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వచ్చాయి అప్పట్లో. ఈక్రమంలో వచ్చే ఎన్నికలల్లో తమ పార్టీకి లబ్ది చేకూరేలా జగన్ ప్లాన్ చేస్తున్నారా? టీడీపీపైనా ..జనసేనపైన బురద చల్లే యోచనలో వర్మతో సినిమా తీయించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వీరిద్దరి భేటీ కావటం. ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మతో జగన్ భేటీ చాలా కీలకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జగన్ ఎవ్వరికి ఆఖరికి తన ఎమ్మెల్యేలకు..మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరని అంటుంటారు. అటువంటిది వర్మతో సమావేశం అత్యంత కీలకమని మాత్రం తెలుస్తోంది.