YS Viveka Case : సీబీఐ ముందు విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి అనుచరులు వీరే..

YS వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అనుచరులు విచారణకు హాజరయ్యారు. హత్య జరిగిన రోజు వారు అతనితో ఎందుకున్నారు?

YS Viveka Case : సీబీఐ ముందు విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి అనుచరులు వీరే..

YS Viveka Case

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా సడెన్ గా ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరుకాలేనని నాలుగు రోజులు గడువు కావాలని కోతురు అవినాశ్ సీబీఐను కోరగా అనుమతి లభించింది. కానీ అవినాశ్ రెడ్డి అనుచరులు మాత్రం సీబీఐ విచారణకు హజరయ్యారు. నాగేళ్ల విశ్వేశ్వర రెడ్డి,వర్రా రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజున ఈకేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు వీరు ముగ్గురు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో వీరిని విచారణకు రమ్మని ఆదేశించిగా ముగ్గురు విచారణకు హాజరయ్యారు.

కాగా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఉదయ్ రెడ్డి అప్పీల్ చేసుకోగా దాన్ని సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. దీంతో సీబీఐ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

YS Viveka Case : అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ పిలుపు .. 19న విచారణకు రావాల్సిందే

అలాగే ఈ కేసులో అంత్యంత కీలక నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా బెయిల్ కు అప్పీల్ చేసుకోగా సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయటంతో ఆయన బెయిల్ కూడా రద్దు చేసింది న్యాయస్థానం. ఇలా ఈ కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.

ఈక్రమంలో అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా నాలుగు రోజులు గడువు కోరారు.దానికి సీబీఐ అంగీకరిస్తునే మే 19న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా..ఈరోజు అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు అయితే విచారణ తరువాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటం వల్లే కావాలనే అవినాశ్ విచారణకు హాజరుకాకుండా గడువు కోరినట్లుగా తెలుస్తోంది. ఇలా ఈకేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరి 18న అవినాశ్ విచారణకు హాజరైతే అరెస్ట్ అనివార్యమా? లేదా విచారించి వదిలేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.