YS Viveka Case : అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ పిలుపు .. 19న విచారణకు రావాల్సిందే

నువ్వు రానంటే రాలేనంటే మేము వదిలేస్తామా? అన్నట్లుగా ఉంది సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో. ఈరోజు రాకపోతే ఓకే..19న మాత్రం విచారణకు రావాల్సిందేనని స్ఫష్టం చేస్తు మరోసారి నోటీసులు జారీ చేసింది.

YS Viveka Case : అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ పిలుపు .. 19న విచారణకు రావాల్సిందే

YS Viveka case MP Avinash reddy

YS Viveka Case : నువ్వు రానంటే రాలేనంటే మేము వదిలేస్తామా? అన్నట్లుగా ఉంది సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు రావాల్సి ఉండగా ముందస్తు ప్రోగ్రామ్ ఉన్నాయని ఈరోజు విచారణకు హాజరుకాలేనని నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరుతు సీబీఐను కోరారు. దీనికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. అనుమతిని ఇచ్చింది. ఈక్రమంలో నాలుగు రోజులు గడువుకు అనుమతి ఇస్తునే గడువు పూర్తి అయ్యాక తప్పకుండా విచారణకు రావాల్సిందేనని స్పష్టంచేస్తు సీబీఐ మరోసారి అవినాశ్ కు నోటీసులు జారీ చేసింది. మే 19న విచారణకు రావాలని ఆదేశించింది.

సీబీఐ నాలుగు రోజులు గడువు ఇవ్వటంతో అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరి వెళ్లారు. అవినాశ్ దారి మద్యలో ఉండగానే సీబీఐ ఆయనకు ఝలకు ఇస్తు వాట్సాప్ ద్వారా 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు.

YS Viveka Case : విచారణకు రాలేనని చెప్పిన అవినాశ్ రెడ్డి .. అంగీకరించిన సీబీఐ

కాగా ఇప్పటికే అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు పలుమార్లు హాజరయ్యారు. దీంతో ఏం సమయంలో అయినా అరెస్ట్ జరగొచ్చు అనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా సీబీఐ అవినాశ్ ను అరెస్ట్ చేయకుండా కేవలం విచారించి వదిలేసింది. అవినాశ్ అరెస్ట్ అనివార్యం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని అటు సుప్రీంకోర్టుకు, ఇటు తెలంగాణ హైకోర్టు కూడా తెలిపిన సీబీఐ పలు కీలక పరిణామాల మధ్య ఇప్పటికి అరెస్ట్ చేయకపోవటంపై పలు విమర్శలు అనుమానాలు వస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం వివేకా కేసులో ఆధారాలను అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి మాయం చేశారని..చెబుతునే మరోపక్క విచారణలోనే సరిపెడుతోంది. అవినాశ్ ఎన్నిసార్లు సీబీఐ విచారణకు హాజరైనా విచారణకు సహకరించటంలేదని సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా..అవినాశ్ మరోసారి ఎస్కేప్ అయ్యారు. నాలుగు రోజులు గడువు అడిగారు.దానికి సీబీఐ కూడా అంగీకరించింది. ఈక్రమంలో అవినాశ్ హైదరాబాద్ నుంచి బయలుదేరగా దారిలో ఉండగానే సీబీఐ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించింది.