AP New Districts : ఏపీలో ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఏర్పాటు

ప్రస్తుతానికి ఏపీ గవర్నర్‌ వద్దకు కొత్త జిల్లాల ఆర్డినెన్స్‌ చేరింది. ఆన్‌లైన్‌లోనే ఫైల్‌ను కేబినెట్‌కు సర్క్యులేట్‌ చేసిన అధికారులు.. కేబినెట్‌ ఆమోదంతో గవర్నర్‌ వద్దకు పంపారు.

AP New Districts : ఏపీలో ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఏర్పాటు

Ap New Districts (1)

Formation of new districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల అవతరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే తుది నోటిఫికేషన్ విడుదల కానుంది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన ఆయన.. మౌలిక సదుపాయాల కల్పన, అధికారుల విభజనపై అధికారులతో చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఏప్రిల్ 2న ఉగాది రోజున ఉంటుందని భావించినా.. ప్రభుత్వం మాత్రం రెండు రోజులు ఆలస్యంగా ముహుర్తం ఖరారు చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 4న ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్య కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

YCP MLA Anam : కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతానికి ఏపీ గవర్నర్‌ వద్దకు కొత్త జిల్లాల ఆర్డినెన్స్‌ చేరింది. ఆన్‌లైన్‌లోనే ఫైల్‌ను కేబినెట్‌కు సర్క్యులేట్‌ చేసిన అధికారులు.. కేబినెట్‌ ఆమోదంతో గవర్నర్‌ వద్దకు పంపారు. గవర్నర్‌ ప్రస్తుతం ఒడిశా టూర్‌లో ఉన్నారని.. విజయవాడ రాగానే ఆర్డినెన్స్‌ ఫైల్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గవర్నర్‌ ఆమోదం పొందిన ఒకట్రెండు రోజుల్లోనే ఫైనల్‌ గెజిట్ విడుదల చేయనున్నారు.