KVP Ramachandra Rao : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణం : మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.

KVP
KVP Ramachandra Rao : ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు. నిధులు కేటాయించకపోవడంతో పోలవరం అనాధలా మిగిలిందని ఆరోపించారు. 2018లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నేటికి పూర్తి కాలేదని లేఖలో స్పష్టం చేశారు.
Polavaram Project : మరింత ఆలస్యం.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన
చంద్రబాబుతో చేసుకున్న ఒప్పందమేంటో కానీ, విభజన చట్టానికి విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం వదిలేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ప్రతి ఏటా సముద్రంలోకి 300 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిగా కేంద్రం నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని కేవీపీ డిమాండ్ చేశారు.