Merugu Nagarjuna : ప్రొఫెసర్ నుండి అమాత్యుడిగా .. అప్పుడు వైఎస్ఆర్‌తో.. ఇప్పుడు జగన్ వెంట..

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించిన మేరుగ నాగార్జున ఉన్నత విద్యను అభ్యసించారు. విశాఖ పట్టణంలోని ఆంద్రా వర్సింటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాజకీయ అరగ్రేటం..

Merugu Nagarjuna : ప్రొఫెసర్ నుండి అమాత్యుడిగా .. అప్పుడు వైఎస్ఆర్‌తో.. ఇప్పుడు జగన్ వెంట..

Meruga Nagarjuna

Merugu Nagarjuna : గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించిన మేరుగ నాగార్జున ఉన్నత విద్యను అభ్యసించారు. విశాఖ పట్టణంలోని ఆంద్రా వర్సింటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాజకీయ అరగ్రేటం చేశారు. మేరుగ నాగార్జు విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. వెల్టూరులోనే పదో తరగతి వరకు చదివి, 1982లో ఇంటర్మీడియట్, 1985లో రేపల్లెలోని ఏబీఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి 1987లో ఎం.కామ్, 1989 లో ఎంఫిల్, 1994లో పీహెచ్ డీ పూర్తి చేశాడు.

Ys jagan : మారిన జగన్ వ్యూహం.. కొత్త కేబినెట్‌లో 10మంది పాత మంత్రులకు ఛాన్స్?

మేరుగ నాగార్జునకు కాలేజీ విద్యను అభ్యసించే సమయంలోనే రాజకీయాలంటే మక్కువ. కాలేజీ రాజకీయాల్లో చైతన్యంగా ఉండే మేరుగ.. విశాఖపట్టణంలోని ఆంద్రా వర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే.. 2009లో వేమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రెండేళ్ల పాటు పనిచేశారు. వైఎస్ మరణానంతరం 2012లో వైకాపాలో చేరి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా మేరుగ నాగార్జున పనిచేశారు. వైసీపీ బలోపేతానికి మేరుగ నాగార్జున ఎనలేని కృషి చేశారు. 2014 సంవత్సరంలో వేమూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్థుడిగా ఉంటూ గుంటూరు రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

Jagan Cabinet 2.0 : కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం.. మహిళకే హోంమంత్రి పదవి ?

ప్రజా సమస్యల పరిష్కారంలో మేరుగ నాగార్జున ముందుంటారని స్థానిక ప్రజలు పేర్కొంటుంటారు. సమస్య వచ్చిందంటే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించే తత్వం నాగార్జున సొంతం. ప్రజా ఉద్యమాల్లో సుదీర్ఘ ప్రస్థానం కలిగిన మేరుగ.. దళిత సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. దళితుల జీవితాలు చదువుతోనే మారతాయని పదేపదే చెబుతూ దళిత విద్యార్థుల ఉన్నత చదువులు అభ్యసించేలా తనవంతుగా బాసటగా నిలుస్తూనే.. అంబేద్కర్ ఆశయాల సాధనకు అడుగులేస్తున్నారు. పార్టీ ఎజెండాను బలంగా వినిపించ గల సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపు, ఉన్నత విద్యావంతుడు కావడం, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపే నేతగా గుర్తింపు.. వీటితో పాటు ఆది నుంచి జగన్ వెంట నడుస్తూ జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్థుడిగా ఉండటం వంటి అంశాలు మేరుగ నాగార్జునకు మంత్రి పదవి దక్కేందుకు కారణమయ్యాయని చెప్పవచ్చు.