Ys jagan : మారిన జగన్ వ్యూహం.. కొత్త కేబినెట్‌లో 10మంది పాత మంత్రులకు ఛాన్స్?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్.. ఇక నుంచి ఎన్నికల సమయమని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గ

Ys Janga
Ys jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్.. ఇక నుంచి ఎన్నికల సమయమని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి గడపకు రెండుమూడు సార్లువెళ్లి ప్రజలకు మరింత దగ్గర కావాలని సూచించారు. ప్రజాదరణ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. అంతేకాక కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టిసారించారు. ఇప్పటికే కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేయగా.. కొత్తగా ఏర్పాటు కాబోయే మంత్రివర్గంలో పాతవారికి ఒకరిద్దరు మినహా కొత్తవారికే మంత్రి పదవులు కట్టబెడతానని జగన్ స్పష్టం చేశాడు. అయితే రాబోయేది ఎన్నికల కాలం కావటంతో అందరూ కొత్తవారైతే ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
AP Ministers Resignations : సీఎం జగన్ కు రాజీనామా పత్రాలు సమర్పించిన మంత్రులు
ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. కేబినెట్ కూర్పులో కనీసం 7 నుంచి 10 మంది వరకు పాత మంత్రులను కొనసాగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరిలో సీనియర్లకు తొలిప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన, అనిల్ యాదవ్, బాలినేని, కన్నబాబుతో పాటు మరో ఇద్దరు పాత మంత్రులకే కొత్తగా కొలువుదీరబోయే కేబినెట్‌లో అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. సామాజిక సమీకరణాల వారీగా జయరామ్, వేణుగోపాల్, అప్పలరాజు, సురేష్, అంజద్ బాషా, శంకర్ నారాయణ, తనేటి వనిత లకు కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నూతనంగా కొలువుదీరబోయే కేబినెట్‌లో మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఇస్తార్న అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. గురువారం రాజీనామా చేసిన మంత్రుల్లో సగం మందికిపైగా తమకు మరోసారి అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారట. ఎమ్మెల్యేలు సైతం ఎవరికి వారు సామాజిక వర్గాల సమీకరణలు బేరీజు వేసుకుంటూ తనకు మంత్రి పదవి ఖాయమన్న దీమాతో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. రాబోయేది ఎన్నికల సమయం కావటం, మరోసారి అధికారమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో నూతనంగా ఏర్పడబోయే కేబినెట్‌లో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.