Srivari Darshanam : శ్రీవారి దర్శనానికి ఫుల్‌ డిమాండ్…3 గంటల్లోనే 7 లక్షల 8వేల ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్

కరోనా కాలంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 7లక్షల 08వేల టిక్కెట్లు బుక్ అయ్యాయి.

Srivari Darshanam : శ్రీవారి దర్శనానికి ఫుల్‌ డిమాండ్…3 గంటల్లోనే 7 లక్షల 8వేల ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్

Tirumala

Full demand for Srivari Darshan : కరోనా సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. నిన్న శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.  ప్రత్యేక దర్శనం టికెట్లు వేగంగా అమ్ముడుపోయాయి. 300 రూపాయల ధర. 7లక్షల 08వేల టిక్కెట్లు. కేవలం మూడు గంటల్లోనే శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు అమ్ముడుపోయాయి. శ్రీవారి దర్శనానికి ఎంత క్రేజ్‌ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడు లక్షలకుపైగా దర్శన టికెట్లు…. హాట్‌ కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. కేవలం మూడు గంటల్లోనే బుక్‌ చేసుకున్నారు భక్తులు. ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేసిన అరగంటలోనే సగానికి పైగా బుక్‌ అయ్యాయి. మిగిలినవి మరో రెండున్నర గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో శ్రీనివాసుడు దర్శనానికి ఫుల్‌ డిమాండ్‌ ఉందన్నది మరోసారి నిరూపితమైంది.

Thirumala : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల

నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను నిన్న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి 7 లక్షల 8వేల టికెట్లను వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. ఇలా టీటీడీ పెట్టిందో లేదో.. అలా అమ్ముడుపోయాయి. శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లన్నీ బుక్‌ చేసుకున్నారు భక్తులు. ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 21 కోట్ల 24 లక్షల ఆదాయం సమకూరింది.

వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈనెల వరకు రోజుకు 8వేల చొప్పున విక్రయించింది. నవంబర్‌ నుంచి వీటి కోటాను 12వేలకు పెంచింది. రోజువారీ కోటాను 12వేలకు పెంచి మరీ ఆన్‌లైన్‌లో ఉంచింది టీటీడీ. టికెట్లన్నీ అమ్ముడు పోతాయా లేదా సందేహం కాస్తా టీటీడీ అధికారుల్లో ఉండేది. కానీ భక్తులు టికెట్లన్నీ మూడు గంటల్లోనే బుక్‌ చేసుకుని అందరికీ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటే చాలు… తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి మరీ ఏడుకొండలవాడి దర్శనానికి వస్తుంటారు. అయితే తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుని దర్శనానికి పలు మార్గాలు ఉన్నాయి. సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్‌ దర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు.

ఒకప్పుడు తిరుమలకు వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేసిన టీటీడీ.. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన టికెట్ల జారీ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. 60 రోజుల ముందుగా రిజర్వ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌, అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ద్వారా సేవా టికెట్లను విక్రయిస్తోంది. ఇందులో భాగంగానే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది.