Chandrababu Interim Bail : చంద్రబాబు అరెస్టు నుంచి బెయిల్ వరకు.. ఎప్పుడు ఏం జరిగింది.. పూర్తి వివరాలు ఇలా..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివరాలను పరిశీలిస్తే..

Chandrababu
skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆయనకు నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి నేరుగా అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు.
చంద్రబాబు అరెస్టు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?.
సెప్టెంబర్ 9
ఉదయం 6 గంటలకు చంద్రబాబు అరెస్ట్
సెప్టెంబర్ 9
సాయంత్రం 5 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయానికి చంద్రబాబు
సెప్టెంబర్ 9
రాత్రి వరకు చంద్రబాబును విచారించిన సీఐడీ
సెప్టెంబర్ 10
ఉదయం 3.35 గంటలకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు
సెప్టెంబర్ 10
4.40 గంటలకు మళ్లీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు
సెప్టెంబర్ 10
6 గంటలకు ఏసీబీ కోర్టుకు చంద్రబాబు
సెప్టెంబర్ 10
సాయంత్రం 7 గంటల వరకు వాదనలు
సెప్టెంబర్ 10
రాత్రి 8.45 గంటలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు
సెప్టెంబర్ 10
రాత్రి 10.30 గంటలకు రాజమండ్రి జైలుకు తరలింపు
సెప్టెంబర్ 11
చంద్రబాబు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
సెప్టెంబర్ 11
మరుసటి రోజుకు వాయిదా వేసిన ఏసిబీ కోర్టు
సెప్టెంబర్ 14
కస్టడీకి ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదుల కౌంటర్
సెప్టెంబర్ 16
హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు
సెప్టెంబర్ 16
18వ తేదీకి క్వాష్ పిటిషన్ వాయిదా
సెప్టెంబర్ 16
18వ తేదీ వరకు వాదనలు నిలిపివేయాలని దిగువ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు
సెప్టెంబర్ 20
మరోసారి కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు
సెప్టెంబర్ 21
తీర్పు 22వ తేదీకి వాయిదా
సెప్టెంబర్ 22
22వ తేదీన హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్
సెప్టెంబర్ 22
మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబును కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు
సెప్టెంబర్ 23
చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు
సెప్టెంబర్ 24
చంద్రబాబును రెండో రోజు విచారించిన సీఐడీ అధికారులు
సెప్టెంబర్ 24
సాయంత్రం 6 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన సీఐడీ
సెప్టెంబర్ 24
సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబుకు మరోసారి రిమాండ్
సెప్టెంబర్ 24
అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
సెప్టెంబర్ 25
క్వాష్ పిటిషన్‌ను CJI ధర్మాసనం ముందు ప్రస్తావించిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా
సెప్టెంబర్ 25
బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా
సెప్టెంబర్ 26
ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదన
సెప్టెంబర్ 26
CJI ధర్మాసనం ముందు చంద్రబాబు SLP మెన్షన్ చేసిన లూథ్రా
సెప్టెంబర్ 27
స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ అక్టోబర్ 3కు వాయిదా
అక్టోబర్ 3
స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ సెక్షన్ 17Aపై వాదనలు
అక్టోబర్ 3
SLPపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 9కి వాయిదా
అక్టోబర్ 4
బెయిల్, సీఐడీ కస్టడి పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ అక్టోబర్ 5కు వాయిదా
అక్టోబర్ 5
బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ అక్టోబర్ 6కు వాయిదా
అక్టోబర్ 5
అక్టోబర్ 19 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
అక్టోబర్ 6
బెయిల్, కస్టడీ పిటిషన్లపై హైకోర్టు తీర్పు అక్టోబర్ 9కి వాయిదా
అక్టోబర్ 9
బెయిల్, కస్టడీ పిటిషన్లను కొట్టేసిన ఏసీబీ కోర్టు
అక్టోబర్ 9
SLPపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 10కి వాయిదా
అక్టోబర్ 10
SLPపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 13కి వాయిదా
అక్టోబర్ 13
SLPపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 17కి వాయిదా
అక్టోబర్ 17
SLPపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
అక్టోబర్ 17
బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబర్ 19కి వాయిదా
అక్టోబర్ 19
బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్‌కు బదిలీకి ఏపీ హైకోర్టు అనుమతి
అక్టోబర్ 19
జ్యుడీషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు
అక్టోబర్ 20
చంద్రబాబుకు రెండుసార్లు లీగల్ ములాఖత్‌లకు ఏసీబీ కోర్టు అనుమతి
అక్టోబర్ 21
ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కి చంద్రబాబు బెయిల్ పిటిషన్ బదిలీ
అక్టోబర్ 27
వెకేషన్ బెంచ్‌లో విచారణ నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
అక్టోబర్ 27
హైకోర్టులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
అక్టోబర్ 27
అక్టోబర్ 30న రెగ్యులర్ బెంచ్‌లోనే బెయిల్ పిటిషన్ల విచారణ
అక్టోబర్ 27
ఏసీబీ కోర్టులో సీఐడీ కాల్‌డేటా రికార్డు పిటిషన్‌పై ముగిసిన వాదనలు, అక్టోబర్ 31న తీర్పు
అక్టోబర్ 30
మధ్యంతర బెయిల్‌పై తీర్పు రిజర్వ్
అక్టోబర్ 31
4 వారాలు మధ్యంతల బెయిల్ మంజూరు