Vallabhaneni Vamsi : టీడీపీని స్థాపించింది పెద్ద ఎన్టీఆర్, దానికి వారసుడు జూ.ఎన్టీఆర్- వంశీ

Vallabhaneni Vamsi : టీడీపీని స్థాపించింది పెద్ద ఎన్టీఆర్, దానికి వారసుడు జూ.ఎన్టీఆర్- వంశీ

Vallabhaneni Vamsi : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. జూ.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి, టీడీపీలోకి రావాలని టీడీపీ నేత నారా లోకేశ్ ఆకాంక్షను వ్యక్తం సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు హైలైట్ అయ్యింది.

మరోసారి యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానిస్తూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడ్డారు.

Also Read..Kodali Nani : టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కి అప్పగించాలి, ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది-కొడాలి నాని

”జూనియర్ ఎన్టీఆర్ ని లోకేశ్ ఆహ్వానించడం పెద్ద జోక్. టీడీపీ పెట్టింది లోకేశ్ తాత ఖర్జూర నాయుడు కాదు. టీడీపీని స్థాపించింది పెద్ద ఎన్టీఆర్. దానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ల తాత పెట్టిన పార్టీలోకి ఆహ్వానించడానికి లోకేశ్ ఎవరు? లోకేష్ కి బొడ్డు ఊడకముందే టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలొడ్డి పని చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరి దయ అవసరం లేదు. వాళ్ల తాత పెట్టిన పార్టీ ఆయన చూసుకోగలడు” ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.(Vallabhaneni Vamsi)

జూ.ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానిస్తూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి కొడాలి నాని కూడా నిప్పులు చెరిగారు. అసలు, జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ లోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవడు..? అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటని అడిగారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీ పగ్గాలను వెంటనే ఎన్టీఆర్ కి అప్పగించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. మార్పు రాష్ట్రంలో కాదు టీడీపీలో రావాలన్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు ఘోరంగా అవమానించ లేదా? అని కొడాలి నాని నిలదీశారు.

Also Read.. Nara Lokesh On Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేశ్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.