CM Jagan On Elections : ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలి-వైసీపీ నేతలకు సీఎం జగన్ సూచన

మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్న జగన్.. ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా ఒకటి కావాలన్న జగన్, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామన్నారు.

CM Jagan On Elections : ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలి-వైసీపీ నేతలకు సీఎం జగన్ సూచన

Updated On : October 13, 2022 / 8:23 PM IST

CM Jagan On Elections : సీఎం జగన్ అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తను మాత్రమే కాదు పార్టీ నేతలను సైతం ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక సూచన చేశారు. వైసీపీ నేతలంతా ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు జగన్.

అమరావతి క్యాంప్ కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్న జగన్.. ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా ఒకటి కావాలన్న జగన్, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు. ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగుంటే వాటిని రిపేర్ చేస్తున్నాం. అంతా కలిసికట్టుగా పని చేస్తేనే విజయం చేకూరుతుంది. ప్రాధాన్యత పనుల కోసం సచివాలయానికి రూ.20లక్షలు ఇస్తున్నాం. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే వెళ్లి సాధకబాధకాలు తెలుసుకోవాలి.