Student Stuck Between Train And Platform : నరకం చూసి యువతి మృతి, దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడ్డ శశికళ కథ విషాదాంతం

Student Stuck Between Train And Platform : నరకం చూసి యువతి మృతి, దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడ్డ శశికళ కథ విషాదాంతం

Student Stuck Between Train And Platform : విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని కథ విషాదంగా ముగిసింది. మృత్యువుతో పోరాడిన శశికళ మృతి చెందింది. శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పక్కటెముకలు విరిగిపోవడంతో నడుముకు బలమైన గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు.

విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్న విద్యార్థిని శశికళ రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నిన్న దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్, రైలు మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో నరకం చూసింది. బాధతో విలవిలలాడింది.

Also Read..Bihar Train Incident : చాలా చాలా లక్కీ.. చావు జస్ట్ మిస్.. పైనుంచి వెళ్లిన రైలు, అయినా బతికిపోయాడు

రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన యువతిని రైల్వే పోలీసులు ఎంతో శ్రమించి బయటకు తీశారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శశికళ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది.

Also Read..Lady With Phone On Railway Track : నీ ఫోన్ పిచ్చి పాడుగాను.. ప్రాణం మీదకు వచ్చినా ఫోన్ మాట్లాడటం మాత్రం ఆపలేదు..

శశికళ విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. రైలు దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. రైలు, ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్కుంది. గంటన్నర సేపు నరకయాతన అనుభవించింది. రైల్వే సిబ్బంది, పోలీసులు, ప్రయాణికులు తీవ్రంగా శ్రమంచి, ఎంతో కష్టపడి శశికళను బయటకు తీశారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, లాభం లేకుండా పోయింది. బయటకు తీసినప్పటి నుంచి కోమాలో ఉన్న శశికళలో గురువారం సాయంత్రం చనిపోయింది.

శశికళ అన్నవరంలో.. గుంటూరు నుండి రాయఘడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఎక్కింది. రైలు దువ్వాడ స్టేషన్‌లో ఆగడంతో దిగేందుకు ప్రయత్నించింది. ఆ హడావిడిలో ఆమె కాలు జారడంతో రైలుకు ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోయింది. యువతి ప్రాణభయంతో కేకలు వేయడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ప్రయాణికులను ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది. రైలుకు, ప్లాట్ ఫామ్ కు మధ్యన ఇరుక్కున యువతి.. బాధతో విలవిలలాడుతుంటే చూడలేకపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యువతి ఇరుక్కుపోవడం గుర్తించిన వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది.. ఆమెను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. తక్షణం రైలు నిలిపి వేశారు. గంటన్నర పాటు శ్రమించి యువతిని రక్షించారు. నడుము ఇరుక్కుపోవడంతో విద్యార్ధిని ప్రాణభయంతో పెద్దగా కేకలు వేసింది. ఎంతో శ్రమించిన రైల్వే సిబ్బంది విద్యార్థినిని కాపాడినా ప్రయోజనం లేకపోయింది. మృత్యువుతో పోరాడిన శశికళ కన్నుమూసింది.