Tiruchanur Brahmotsavam 2021 : రాజమన్నార్ స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం ఉదయం రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి శ్రీ పద్మావతి మ్మవారు కల్పవక్ష వాహానంపై

Tiruchanur Brahmotsavam 2021 : రాజమన్నార్ స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు

Kalpavriksha vahanam

Tiruchanur Brahmotsavam 2021 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం ఉదయం రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి శ్రీ పద్మావతి మ్మవారు కల్పవక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

Also Read : President Ram Nath Kovind : శీతాకాల విడిది కోసం ఈనెలాఖరున హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
ఈ రోజు ఉదయం జరిగిన వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,   పలువురు అధికారులు పాల్గొన్నారు.