Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో భక్తుల సంఖ్య పెంచనున్నట్లు వెల్లడించారు.

Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో భక్తుల సంఖ్య పెంచనున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారు.

చదవండి : Tirumala Ghat Road: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్ క్లోజ్

వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కరోనా తగ్గుముఖం పడుతోంది. అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లోనా.. లేద ఆఫ్‌ లైనా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

చదవండి : Tirumala : తిరుమలలో ఆ 3 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు