Constable Suicide : కానిస్టేబుల్ ఆత్మహత్య- కారణం తెలిస్తే ఆశ్చర్య పోతారు. ..!
పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ భార్య, కూతురు ఉండగా, తన ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోటానికి ప్రయత్నించాడో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్. ఆ ప్రియురాలు కూడా కాదనే సరికి ఆత్మహత్య చేసుకున్న

constable suicide
Constable Suicide : పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ భార్య, కూతురు ఉండగా, తన ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోటానికి ప్రయత్నించాడో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్. ఆ ప్రియురాలు కూడా కాదనే సరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంపచోడవరం ప్రాంతానికి చెందిన సురేష్(34) అనే వ్యక్తి 2009లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం విశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. సురేష్ కు 2016లో తూర్పు గోదావరి జిల్లా రాజోలుకి చెందిన సునీతతో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరికి 4 నెలల పాప ఉంది.
మధురవాడ శివశక్తినగర్ రోడ్డులోని బ్లూ సిటీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో రెండేళ్లుగా నివసిస్తున్నాడు. ఈక్రమంలో అతనికి ఒక మహిళతో పరిచయం అయ్యింది. భార్య ఉండగా సురేష్ ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. ఈ క్రమంలో అతనికి నాలుగు నెలల క్రితం కూతురు పుట్టింది. డెలివరీకి భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చింది.
గత నెలలో తాను మరోక యువతిని ప్రేమిస్తున్నానని సురేష్ భార్యకు చెప్పాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అందుకు అంగీకరించాలని భార్యను కోరాడు. అందుకు ఆమె తిరస్కరించి కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సురేష్ ప్రేమిస్తున్న మహిళ బుధవారం సునీతకు ఫోన్ చేసి తాను సురేష్ ను ప్రేమించటంలేదని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది.
అదే రోజు రాత్రి సురేష్ భార్యకు ఫోన్ చేసి తానుప్రేమించిన మహిళ తనను తిరస్కరించిందని… తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోటో సుసైడ్ సెల్ఫీ ఫోటో పంపించాడు. ఆతర్వాత భార్య ఫోన్ చేసినా సమాధానం లేకపోవటంతో ఆమె ఎదుటి ఫ్లాట్ లో వాళ్ళను అలర్ట్ చేసింది. వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఉరేసుకున్న సురేష్ ను కిందకు దించి స్ధానిక ఓ ప్రవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
Also Read : Srinivasgoud: అందుకే మంత్రిని లేకుండా చేద్దామని ప్లాన్ చేశాం..!
ఆత్మహత్య కేసు అవటంతో వాళ్ళు ఎడ్మిట్ చేసుకోలేదు. అక్కడి నుంచి జీజీహెచ్ కు తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేష్ మరణించినట్లు తెలిపారు. గురువారం రాజోలు నుంచి తల్లి తండ్రులతో వచ్చిన సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఉండగా ఆమెకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకోవాలనుకోవటం.. ఆమెతిరస్కరించటంతో నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు పోలీసు కానిస్టేబుల్.