APPSC Group 1: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23-29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతారు.

APPSC Group 1: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!

APPSC Group 1: ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23-29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి.

Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతారు. దీంతో రెండూ ఒకే సమయంలో ఉంటే అభ్యర్థులకు ఇబ్బందిగా మారుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షల్ని వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరుగుతాయి. అందువల్ల ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. జూన్ మొదటి వారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. సివిల్స్ ఇంటర్వ్యూలకు గ్రూప్-1 మెయిన్స్ రాస్తున్న 25 మంది హాజరవుతున్నారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఈ మార్పు చేసింది.

Pulivendula: పులివెందులలో కాల్పులు.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

ఏపీలో గ్రూప్-4 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఈ పరీక్ష జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్-4 ద్వారా ఏపీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ పరీక్షకు 11,574 మంది అభ్యర్థులు హాజరవుతారు.