Pulivendula: పులివెందులలో కాల్పులు.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

మస్తాన్, దిలీప్‌తో డబ్బుల విషయంలో భరత్ యాదవ్ గొడవపడ్డాడు. పులివెందులలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న భరత్ యాదవ్ వెంటనే ఇంటికి వెళ్లి, తుపాకీ తీసుకొచ్చాడు. దిలీప్‌పై రెండు రౌండ్లు, మస్తాన్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

Pulivendula: పులివెందులలో కాల్పులు.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

Pulivendula: ఏపీ, వైఎస్సార్ కడప జిల్లా, పులివెందులలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందులకు చెందిన భరత్ యాదవ్ అనే వ్యక్తి, దిలీప్ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు.

Kapu Reservation: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈ డబ్బులు తిరిగిచ్చే విషయంలో దిలీప్, భరత్ యాదవ్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. రూ.2.5 లక్షలకు సంబంధించి మంగళవారం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో దిలీప్ స్నేహితుడు మస్తాన్ కూడా ఉన్నాడు. మస్తాన్, దిలీప్‌తో డబ్బుల విషయంలో భరత్ యాదవ్ గొడవపడ్డాడు. పులివెందులలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న భరత్ యాదవ్ వెంటనే ఇంటికి వెళ్లి, తుపాకీ తీసుకొచ్చాడు. దిలీప్‌పై రెండు రౌండ్లు, మస్తాన్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గాల్లోకి మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

ఈ ఘటనలో దిలీప్ ఘటనా స్థలంలోనే మరణించాడు. మస్తాన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మస్తాన్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, నిందితుడు భరత్ యాదవ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.