Tirupatiలో భక్తుల రద్దీ, రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల ఆదాయం

Tirupatiలో భక్తుల రద్దీ, రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల ఆదాయం

Growing devotees in Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (tirumala venkateswara temple) వారి దర్శనానికి అన్ని నిబంధనలు తొలగించడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ (Covid – 19) నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి TTD అనుమతి ఇస్తోంది. అయినా కూడా ప్రతి రోజూ భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

క్యూ లైన్‌లో అధికంగా భక్తులు వేచి ఉంటున్నారు. వీరికి శ్రీవారి దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం 38 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీకి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అలాగే శ్రీవారికి 15 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడాలిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు అధికంగానే నమోదయ్యాయి. ఈ వైరస్ అన్ని రంగాలపై పడింది. దేవాలయాలను కొద్ది రోజుల పాటు మూసివేశారు. ప్రముఖ ఆలయాల్లో పేరొందిన తిరుమల తిరుపతి దేవాలయంలో కూడా కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధించారు. కరోనా ప్రభావంతో గత 4, 5 నెలలుగా తిరుమలకు వచ్చే భక్తులు భారీగా తగ్గిపోయారు. దీంతో స్వామివారి హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. లాక్‌ డౌన్, కరోనాతో కొన్ని నెలల పాటు తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేశారు.

తర్వాత పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం బాగా పడిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటు టీటీడీ ఆంక్షలను తొలగించడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. ఇక వైకుంఠ ఏకాదశి సమయంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుందని టీటీడీ భావిస్తోంది. ఇందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పూర్తి చేసింది.