Birthplace of Lord Hanuman: హనుమంతుడు మనవాడే..

హనుమంతుడు తెలుగువాడని ఒకరు....కాదని మరోకరు ఇలా పురాణ ఇతీహసాలకే సవాలు విసిరిన హనుమంతుని జన్మస్థల వివాదానికి తెరపడబోతోంది. ఇందుకు ప్రకాశం జిల్లాలోని ఓ హనుమంతుని భక్తుడు దశాబ్ధాలపాటుగా చేసిన కృషి ఫలించబోతోంది.

Birthplace of Lord Hanuman: హనుమంతుడు మనవాడే..

Hanuman Be Longs To Telugu

TTD’s claim on Hanuman’s birthplace at Tirumala Hills : హనుమంతుడు తెలుగువాడని ఒకరు….కాదని మరోకరు ఇలా పురాణ ఇతీహసాలకే సవాలు విసిరిన హనుమంతుని జన్మస్థల వివాదానికి తెరపడబోతోంది. ఇందుకు ప్రకాశం జిల్లాలోని ఓ హనుమంతుని భక్తుడు దశాబ్ధాలపాటుగా చేసిన కృషి ఫలించబోతోంది. ఆంజనేయుడి పుట్టుకకు చెందిన చారిత్రాత్మక ఆధారాలను సేకరించి సిద్దహస్తుడయ్యాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయనతో ఏకీభవించడంతో త్వరలోనే ఆంజనేయుడు పుట్టిన గడ్డ ఓ వెలుగు వెలగనుంది.

అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభంతో వెలుగులోకి వచ్చిన హనుమంతుని జన్మస్థల వివాదానికి ఎట్టకేలకు టీటీడీ ఫుల్‌స్టాప్‌ పెట్టబోతోంది. ఇందుకు ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమంతుడి ఉపాసకుడు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రీ సేకరించిన ఆధారాలు చరిత్రకు కల్లకు కట్టినట్లు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఇవాళ హనుమంతుడు తెలుగువాడేనని ఆయన జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రీనేనని తగిన ఆధారాలతో టీటీడీ ప్రకటించనుంది.

వాస్తవానికి హనుమంతుడి జన్మస్థలంపై ఎన్నో శతాభ్ధాలుగా పరిశోధనలు సాహిత్యకారులు సాగిస్తూనే ఉన్నారు. అయితే వాటికి తగ్గ ఆధారాలను మాత్రం వెలుగులోకి తేలేక పోయారు. దీంతో హనుమంతుడి జన్మస్థలంపై చరిత్ర సాహిత్యకారులు రకరకాలుగా చెబుతూ వచ్చారు. 1920 ఫిబ్రవరిలో భారతీ పత్రికలో కిష్కింద పంచవటీ ప్రస్తుత బల్లారీ, హంపీ ప్రాంతంలోనిదని పేర్కొన్నారు. రుష్యమూకలోని మూక ద్రవిడ పదమని కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రీ వివరించారు. కిష్కిందను పాలించిన ఆ నాటి సుగ్రీవుడు సీత అన్వేషణకు అంజనాద్రిలో నివసిస్తున్న వారి సాయాన్ని కోరారని పురాణాలు చెబుతున్నాయి.

మరోవైపు సురవరం ప్రతాప్ రెడ్డి తన రామాయణ విశేషాలు గ్రంథంలో అంజనాద్రిలో నివసించిన వారు వానరులు కారని దక్షిణ పథంలో ఉన్న అటవీకులని అప్పట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై 1966లో టీటీడీ ప్రచరించిన సప్తగిరి పత్రికలోనూ ఇక్కడ నివసించిన వారు గిరిజన జాతికి చెందిన సవరలని విశ్లేషణతో కూడిన ఒక ఎడిటోరియల్‌లో తెలిపారు. మొదటి సారి హనుమంతుడు లంకకు వెళ్లి వచ్చినట్లు తన సహచరులతో చెప్పాడని లంక అనేది తెలుగు పదమని చిదంబర శాస్త్రీ వివరిస్తున్నారు.

హనుమంతుడి జన్మస్థల అన్వేషనే తన ఊపిరిగా, కళగా జీవించిన చిదంబర శాస్త్రీ 1972 నుంచి ఆంజనేయ జన్మస్థలం కనుగొనేందుకు పరిశోధన చేశారు. పురాణ ఇతిహాసాలు, కిష్కింద కాండల నుంచి ఆంజనేయుడి జన్మస్థల ఆధారాలను సేకరించారు. సంస్కృతంలో ఉన్న తాళపత్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించి హనుమంతుడి జన్మస్థలంపై కీలక సమాచారాన్ని ఆధారాలను సేకరించాడు. ఇంతకాలం తమదంటే తమదేనంటూ జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్న వాదనలు అచ్చు తప్పని చెప్తున్నారు. తాను సేకరించిన ఆధారాలను టీటీడీ ఆమోదించనున్నందున తన జన్మ సఫలమైందని తన చిరకాల కళ నెరవేరబోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జపాలీలో భవ్యమందిర నిర్మాణం చేపట్టాలనేదే తన ఆకాంక్ష అంటున్నారు.