Cyclone Jawad : ఉత్తరాంధ్రకు వర్ష గండం-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారిందని... రేపు ఉదయానికి అది తుపానుగా మారనుందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

Cyclone Jawad
Cyclone Jawad : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారిందని… రేపు ఉదయానికి అది తుపానుగా మారనుందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం జొవాద్ తుపాను పూరి వద్ద తీరం దాటనుంది.
ఇవాళ రాత్రి నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం. రానున్న 12 గంటల్లోపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశంఉందని… ప్రస్తుతం అది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్రవైపు పయనిస్తూ ఉందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు…. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 45-65 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. తుపాను తీరం దాటే సమయంలో 90-100 కిలోమీటర్ల వరకు వేగం పెరిగే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
ఈరోజు, రేపు, కూడా మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి రావాలని కోరారు. ఉత్తరాంధ్రకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీగా తరలి వస్తున్నాయి. శ్రీకాకుళం విజయనగరాలకు ఇప్పటికే బృందాలు చేరుకున్నాయి. అత్యవసర పరిస్ధితులు ఎదుర్కునేందుకు సిధ్దమవుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉందని…లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి.
Also Read : Soft Ware Engineer : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య
ఈరోజు సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో పర్యాటకులు మరో మూడురోజులు ఉత్తరాంధ్ర జిల్లాలకు రావద్దని అధికారుల సూచిస్తున్నారు. తుపాను హెచ్చరికలతో రాష్ట్రప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు సహాయకచర్యలపై దృష్టి సారించారు.
కాగా … రానున్న 24 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం తీర ప్రాంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బంగాల్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. జవాద్ తుపానుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.