HiJab Row : ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ..వికాశ్,చైతన్య స్కూళ్లలో విద్యార్ధినులను అడ్డుకున్న యాజమాన్యం

ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ తాకింది..వికాశ్,చైతన్య స్కూళ్లలో హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్ధినులను స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది.

HiJab Row : ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ..వికాశ్,చైతన్య స్కూళ్లలో విద్యార్ధినులను అడ్డుకున్న యాజమాన్యం

Hijab Row

HIJab Row In AP prakasam Dt Schools : కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. కొన్ని రోజుల క్రితమే ఏపీలోని విజయవాడలోని లయోలా కాలేజీలో ‘హిజాబ్’వివాదం రేకిన విషయం తెలిసిందే. ఇది జిల్లాలలకు కూడా హిజాబ్ సెగ తగిలింది. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలోని ప్రైవేట్ స్కూల్స్ అయిన వికాష్, చైతన్య స్కూల్స్ లో హిజాబ్ వేసుకొన్న ముస్లిం విద్యార్ధినులను లోపలికి రావటానికి అనుమతించకలేదు. వారిని యాజమాన్యం గేటు బయటే నిలబెట్టింది. హిజాబ్ ధరించి వస్తే లోపలికి రానిచ్చేది లేదని యాజమాన్య తేల్చి చెప్పింది. దీంతో విద్యార్ధినులు తమ పేరేంట్స్ కు ఈ విషయం గురించి చెప్పగా..ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పెద్దలు స్కూల్ వద్దకు చేరుకున్నారు. పేరెంట్స్ ఎంతగా చెప్పినా విద్యార్థినులకు లోపలికి వెళ్లటానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు దిగటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Also read : Hijab Row In AP: ఏపీకి పాకిన హిజాబ్ వివాదం..విద్యార్థినిలను అడ్డుకున్న విజయవాడ లయోల కాలేజీ యాజమాన్యం

ఐదు రోజుల క్రితం విజయవాడలోని లయోలా కాలేజీలో కూడా ఇద్దరు విద్యార్ధినులు హిజాబ్ ధరించినందుకు గాను క్లాసులోకి అనుమతించలేదు. అయితే ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. కాలేజీకి యూనిఫామ్ లోనే రావాలని విద్యార్ధినులకు సూచించినట్టుగా చెప్పారు. క్లాస్ రూమ్ లోకి వచ్చే ముందే విద్యార్ధినులు మహిళల వెయిటింగ్ రూమ్ లోనే హిజాబ్ ను తీసి వేసి వస్తారని ప్రిన్సిపాల్ గుర్తు చేశారు. కాలేజీ నియమ నిబంధనల మేరకు విద్యార్ధులంతా వ్యవహరించాల్సి ఉందని ప్రిన్సిపాల్ వివరించారు.

కొన్ని వారాలుగా కర్ణాటలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇదికాస్తా ఇతర రాష్ట్రాలకు చేరింది.కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినిలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి హిజాబ్ లు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కాలేజీల సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా హిజాబ్ వివాదం చెలరేగగా..దీనికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్ధులు కాషాయ కండువాలు ధ‌రించి కాలేజీలకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరించింది. ఇది కాస్తా పెను దుమారంగా మారటంతో కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తిరిగి ప్రారంభం అయ్యాక కూడా ఇదే వివాదం కొనసాగింది.

Hijab Row: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’

కాగా..ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు మరో వర్గం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కాలేజీలకు సోకటంతో ఫిబ్రవరి 8 ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించింది..స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.