AP New Districts : ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బాలకృష్ణ.. సీఎం జగన్‌‌కు విజ్ఞప్తి

హిందూపురం పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిషత్ అవసరాల కోసం అవసరమైన భూమి ప్పుష్కలంగా ఉందన్నారు. జిల్లా ఏర్పాటు చేయడంలో...

AP New Districts : ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బాలకృష్ణ.. సీఎం జగన్‌‌కు విజ్ఞప్తి

Balakrishna

Hindupur MLA Balakrishna : ఏపీ రాష్ట్రంలో ఉగాది నుంచి 26 జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపట్లోనే.. అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థనలు, అభ్యంతరాలు వస్తున్నాయి. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేయాలని ఓ చోట.. తమ నియోజకవర్గాన్ని వేరే జిల్లాలో కలపాలని మరో చోట ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ డివిజన్ మార్చాలని కొందరు.. తాము చెప్పినట్లే.. జిల్లాను ఏర్పాటు చేయాలని ఇంకొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More : Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే..హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్న హిందూపురం వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికపరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాబట్టి.. హిందూపురం పార్లమెంట్ కేంద్రంగా కొత్త జిల్లాని ప్రకటిస్తూ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

Read More : Air India: అధికారికంగా 69ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా

హిందూపురం పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిషత్ అవసరాల కోసం అవసరమైన భూమి ప్పుష్కలంగా ఉందన్నారు. జిల్లా ఏర్పాటు చేయడంలో రాజకీయం చేయవద్దని, హిందూపురం పట్టణ ప్రజల మనోభావాన్ని గౌరవించి వారి చిరకాల కోరిక అయిన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు.