Gorantla Madhav Challenge Chandrababu : ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబుకి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. తనదిగా ప్రచారం జరుగుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని కాణిపాకం వినాయకుడి గుడిలో ప్రమాణం చేస్తానని మాధవ్ అన్నారు.

Gorantla Madhav Challenge Chandrababu : ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్

Gorantla Madhav Challenge Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. తనదిగా ప్రచారం జరుగుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని కాణిపాకం వినాయకుడి గుడిలో ప్రమాణం చేస్తానని మాధవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని చంద్రబాబు కూడా కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు గోరంట్ల.

చంద్రబాబు ప్రమాణం చేస్తే అప్పటికప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రమాణం చేసేందుకు ముందుకు రాకుంటే వీడియో తాను సృష్టించిందేనని ఒప్పుకుని తనకు క్షమాపణ చెప్పాలన్నారు గోరంట్ల మాధవ్.

ఓ మ‌హిళ‌తో తాను న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను గోరంట్ల మాధ‌వ్ మ‌రోమారు ఖండించారు. అది ఫేక్ వీడియో అని పోలీసుల విచార‌ణ‌లో తేలింద‌ని గుర్తు చేశారు. ఫేక్ వీడియో పట్టుకుని ఓ బీసీ ఎంపీని ఇంత‌లా వేధిస్తున్నార‌ని టీడీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు గోరంట్ల మాధవ్. ఆ వీడియోలో ఉన్న‌ది తానేన‌ని, ఆ వీడియో ఒరిజిన‌లేన‌ని తేలితే… తాను త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని అన్నారు. ఆ త‌ర్వాత జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేది కూడా తానేన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

నేను ఏ మ‌హిళ‌తోనూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడ‌లేదు. నాదని చెబుతున్న వీడియో నిజ‌మైన‌ది కాద‌ని నేను కాణిపాకం ఆల‌యంలో ప్ర‌మాణానికి సిద్ధ‌ం. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వీడియో న‌కిలీద‌ని ప్ర‌మాణం చేసేందుకు చంద్ర‌బాబు కూడా సిద్ధ‌మా? అని గోరంట్ల ప్ర‌శ్నించారు.