Rajini Vidadala : దమ్ముంటే రండి.. చంద్రబాబు, లోకేశ్‌కు మహిళా మంత్రి ఓపెన్ చాలెంజ్

Rajini Vidadala : ఆరోగ్య శ్రీ పథకం కింద 3,650 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 10వేల 100 కోట్లు ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఖర్చు పెడుతున్నాం.

Rajini Vidadala : దమ్ముంటే రండి.. చంద్రబాబు, లోకేశ్‌కు మహిళా మంత్రి ఓపెన్ చాలెంజ్

Rajini Vidadala (Photo Twitter, Google)

Updated On : July 2, 2023 / 8:50 PM IST

Rajini Vidadala – Chandrababu Naidu : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పై విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైద్య రంగంపై బహిరంగ చర్చకు తాను సిద్ధం అన్న మంత్రి రజనీ, మీరు సిద్ధమా? అని చాలెంజ్ చేశారు.

” కొన్ని రోజులుగా లోకేశ్ ఆరోగ్యశ్రీ మీద కామెంట్లు చేస్తున్నారు. ఎంతోమంది పేదలకు ఆరోగ్య శ్రీ పథకంలో మెరుగైన వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ఆరోగ్య శ్రీ ఏ విధంగా అమలైందో చర్చకు సిద్దమేనా? అని సవాల్ విసురుతున్నా. ఆరోగ్య శ్రీ ని మీ హయాంలో అనారోగ్య శ్రీ గా మార్చింది మీరు కాదా? ఆరోగ్య శ్రీని టీడీపీ హయాంలో వెంటిలేటర్ పై ఉంచారు. అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చింది ఎవరో తెలుసా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం తెచ్చారు.

Also Read..Atchenaidu : వైసీపీ నేతలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : అచ్చెన్నాయుడు

3257 ప్రొసీజర్లకు పెంచి జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం కింద 3,650 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 10వేల 100 కోట్లు ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటివరకు 36 లక్షలమంది ఆరోగ్య శ్రీ ని ఉపయోగించుకున్నారు. 5 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ ఉపయోగపడుతుంది.

కేన్సర్ పేషెంట్లకు 20 లక్షల వరకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. సగటున 3వేల 400 మంది రోజుకు ఆరోగ్య శ్రీని ఉపయోగించుకుంటున్నారు. జగనన్న పాలన మీద ప్రజల్లో క్రెడిబులిటీ ఉంది. ఆరోగ్య శ్రీ, వైద్యరంగం పై చర్చకు రావాలని చంద్రబాబు, లోకేశ్ లకు బహిరంగ సవాల్ విసురుతున్నా. స్వీకరించే దమ్ము మీకుందా?” అని మంత్రి విడదల రజని అన్నారు.

Also Read..Rahul Gandhi: తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నా.. ఇంకా..: రాహుల్‌ హామీలు